Jabardasth : జబర్దస్త్.. ఇంకా ఎన్నాళ్లు ఈ లవ్ స్టోరీలు, ఉంగరాలు మార్చుకోవడం..!!
Jabardasth : జబర్దస్త్ కార్యక్రమానికి గతంలో మాదిరిగా భారీ ఎత్తున రేటింగ్ నమోదు అవ్వడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా గతంలో మాదిరిగా రేటింగ్ సొంతం చేసుకునే పరిస్థితి కనిపించక పోవడంతో మల్లెమాల వారు లవ్ స్టోరీలను కొత్తగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. లవ్ ట్రాక్ లను సృష్టించేందుకు ఎంతగా ప్రయత్నించినా కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవడం లేదు. ఇప్పటికే జబర్దస్త్ టీం లీడర్ రాకింగ్ రాకేష్ మరియు జోర్దార్ సుజాత ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందరికీ తెలుసు. అయినా కూడా జబర్దస్త్ కార్యక్రమంలో వారిద్దరూ ఏదో కొత్తగా ప్రేమలో పడ్డారని,
వారిద్దరి ప్రేమను ఇప్పుడే చూపిస్తున్నామన్నట్లుగా ప్రోమో విడుదల చేయడం జరిగింది. స్టేజ్ పై రాకేష్ రింగు తీసుకొని సుజాత చేతి వేళ్ళకి తొడిగాడు. గతంలో కూడా ఇదే సీన్ జరిగింది. ఇలా అన్ని సార్లు చూపించిందే చూపించి బోర్ కొట్టిస్తున్నారు అంటూ మల్లెమాల వారిపై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త కంటెంట్ లేకపోతే జబర్దస్త్ కార్యక్రమాన్ని మూసి వేయాలి, అంతే తప్పితే పరువు తీసుకోవద్దు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. గతంలో మాదిరిగా అద్భుతమైన కమెడియన్స్ ఇప్పుడు లేరు. అందుకే సుడిగాలి సుదీర్,
చమ్మక్ చంద్ర, ధన్ రాజ్, వేణు వంటి వారిని తీసుకు రావాలి అంటూ మల్లెమాల వారికి ప్రేక్షకుల విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళని తీసుకు రాకుండా చేసిన స్కిట్స్ మళ్లీ మళ్లీ చేసి, లవ్ ట్రాక్ లను ప్రేక్షకులపై రుద్దడం ఏమాత్రం కరెక్ట్ కాదని ట్రోల్స్ వస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు ఈ లవ్ స్టోరీలు, ఉంగరాలు మార్చుకోవడం చూడాలి అంటూ జబర్దస్త్ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త కమెడియన్స్ వచ్చినా కూడా వారు అలరించలేక పోతున్న నేపథ్యంలో పాత కమెడియన్స్ ని తీసుకు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఉన్న వారిని పంపించేస్తున్న మల్లెమాల వారు వెళ్ళి పోయిన వారిని తీసుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.