Punch Prasad : పంచ్ ప్రసాద్‌ అనారోగ్యంను వాడేస్తున్నారు.. అప్పుడు లేవడం కష్టం అన్నారు, ఇప్పుడు ఇలా..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 2, 2022, 7:30 pm

Punch Prasad : జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం సరిగా ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు . ఆయన భార్య కిడ్నీని డొనేట్ చేసేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఇటీవల నూకరాజు ఒక వీడియో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో లో పంచ్ ప్రసాద్ ఇక నిలబడలేడు.. ఆయన కనీసం తన పని తాను చేసుకోవడం కష్టమే అన్నట్లుగా ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకే పంచ్ ప్రసాద్‌ ఆరోగ్యం బాగానే ఉంది, మెల్ల మెల్లగా కోలుకుంటున్నాడు అంటూ మరో వీడియో పెట్టాడు. తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ లో పంచ్ ప్రసాద్‌ ఎప్పటిలాగే కామెడీ పంచ్ లతో మెప్పించాడు. ఏమాత్రం అనారోగ్యంతో లేడు అన్నట్లుగా ఆయనని చూస్తే అనిపిస్తుంది. అంటే మొన్న.. అంతకు ముందు నూకరాజు పెట్టిన వీడియోలు కేవలం పబ్లిసిటీ కోసమేనా, పంచ్ ప్రసాద్ యొక్క అనారోగ్యాన్ని డబ్బుల సంపాదనకు వాడేసుకుంటున్నారా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. పంచ్‌ ప్రసాద్ ని ఇప్పటికే చాలా వాడేశారు..!

social media trolls on Punch Prasad publicity videos

social media trolls on Punch Prasad publicity videos

ఇంకా కూడా యూట్యూబ్లో డబ్బు సంపాదించడం కోసం ఆయన ఇక లేవలేదు.. నడవలేడు అంటూ పిచ్చి ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో జబర్దస్త్ టీం ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై పంచ్ ప్రసాద్ కూడా డబ్బుల కోసం అన్నట్లుగా జబర్దస్త్ టీం చెప్పినట్లు నడుచుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇలా అనారోగ్య సమస్యలను వాడుకుంటూ డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp