Home » Entertainment » Sohel Debut As Hero In George Reddy Fame Appi Reddy Producer
Entertainment

హీరోగా సోహెల్ ఎంట్రీ.. ఆ నిర్మాతతో ప్రాజెక్ట్ కన్ఫామ్

Authored By
Admin
The Telugu News | Published on: December 24, 2020, 11:37 am
Advertisement

సోహెల్‌కు బుల్లితెర గుర్తింపు ఇచ్చింది. కృష్ణవేణి సీరియల్‌తో సోహెల్ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఇస్మార్ట్ సోహెల్‌గా మారాడు. అయితే వెండితెరపై హీరోగా ఎదగాలని ఎంతో ప్రయత్నించిన సోహెల్ కల నెరవేరబోతోంది. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌గా చేసినా కూడా గుర్తింపు రాలేదు. అలాంటి సోహెల్‌కు ఇప్పుడు బిగ్ బాస్ ఓ ఐడెంటిటీని తీసుకొచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా ఇప్పుడు సోహెల్ భారీ ఇమేజ్‌ను తెచ్చుకున్నాడు.

Advertisement

Sohel Debut as Hero In George reddy fame Appi reddy Producer

ఆ ఇమేజ్‌ను పెట్టుబడిగా పెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. రెండు మూడు రోజుల క్రితం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడాడు. అప్పట్లో ఓ స్క్రిప్ట్ విన్నాను.. మళ్లీ ఇప్పుడు దాన్ని ఓకే చేశాను.. త్వరలోనే ఓ ప్రకటన చేస్తాను అని సోహెల్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చేసింది. కొత్త దర్శకుడితో సోహెల్ సినిమా ఉండబోతోంది.

Advertisement

జార్జి రెడ్డి, ప్రెజర్ కుక్కర్ చిత్రాలను నిర్మించిన అప్పి రెడ్డి.. సోహెల్‌ను హీరోగా పరిచయం చేయబోతోన్నాడు. ఈ మేరకు సోహెల్ తాజాగా ఓ హింట్ ఇచ్చాడు. కొత్త చాప్టర్ ప్రారంభించబోతోన్నాను.. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తాను అని చెప్పాడు. అప్పి రెడ్డి నిర్మాతగా..శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. ఫిబ్రవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతోన్నట్టు తెలిపారు. మొత్తానికి సోహెల్ తన కలను సాకారాం చేసుకున్నాడు.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి