సోలో బ్రతుకే సాయితేజ్ కి హిట్ ఇచ్చిందా ..ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితేంటి ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

సోలో బ్రతుకే సాయితేజ్ కి హిట్ ఇచ్చిందా ..ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితేంటి ..?

 Authored By govind | The Telugu News | Updated on :26 December 2020,2:16 pm

సోలో బ్రతుకే సో బెటర్..మెగా మేనల్లుడు సాయి తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా. లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో మొదలైన మొదటి సినిమా. టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ అండ్ సీనియర్ హీరోలున్నా కూడా ఎవరు తమ సినిమాలని 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. పెద్ద నిర్మాతలు సైతం కోట్లలో లాస్ వస్తుందని తమ సినిమాలని రిలీజ్ చేయకుండా వెనకడుగు వేశారు. ఇలాంటి సమయంలో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి తేజ్ తన సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాడు.

Sai Dharam Tej turns an IAS officer for his next!

అంతేకాదు ఇండస్ట్రీలో కొత్త ఆశలు కలిగించాడు. మరి సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ తో హిట్ అందుకున్నాడా.. నిర్మాత సేఫా.. టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితేంటి.. ఇప్పుడు అన్న వాటికి సమాధానం నో ప్రాబ్లం సినిమా బావుంటే సూపర్ హిట్ పక్కా.. నిర్మాతలు చాలా హ్యాపీగా ఉంటారు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ పెద్ద ప్రభావం చూపించడం లేదని నిరూపించాడు. మొదటి రోజూ అన్ని చోట్ల వసూళ్ళు బావున్నాయంటున్నారు. ఇండస్ట్రీ మొత్తం సాయి తేజ్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఒక్కో సినిమాని రిలీజ్ చేసేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

మొత్తానికి సాయితేజ్ సోలో బ్రతుకే సో బెటర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికి భరోసా కలిగించింది. సోలో బ్రతుకే సో బెటర్ రిలీజైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ వారం గడిస్తే కంప్లీట్ గా రిజల్ట్ విషయం తెలుస్తుందంటున్నారు. అంతేకాదు వసూళ్ళు పరంగా కూడా ఎంత రాబడుతుందన్నది పక్కాగా క్లారిటీ వస్తుంది. ఇక మొదటి రోజు వసూళ్ళు మాత్రం నిర్మాతలకి సంతృప్తిని కలిగించాయని చెప్పుంటున్నారు. ఒకవేళ అడ్వాన్స్ బుకింగ్స్ గనక ఉంటే వసూళ్ళు ఇంకా బావుండేవని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది