Sonakshi Sinha : బ్లూ గౌనులో స్ట‌న్నింగ్ లుక్స్ తో క‌ట్టిప‌డేస్తున్న సోనాక్షి సిన్హా..

Authored By mallesh | The Telugu News | Published on: May 27, 2022, 10:00 pm

Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ద‌బాంగ్ సినిమాతో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శత్రఘ్ను సిన్హా కూతురిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనాతికాలంలోనే అందం న‌ట‌న‌తో మెప్పించింది. బాలీవుడ్ లో రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలిడే.. ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ, లూటేరా, వన్స్ అప‌న్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా, ఆర్ రాజ్‌కుమార్, యాక్షన్ జాక్సన్, కళంక్, మిషన్ మంగళ్, దబాంగ్ 3, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా వంటి హిట్ చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది.

సోష‌ల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మ‌డు ఫ్యాన్స్ తో ముచ్చ‌టిస్తుంది. వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులూ ఇస్తుంట‌ది. రీసెంట్ గా ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు అదిరిపోయే స‌మాధానం ఇచ్చింది. అందరికీ పెళ్లిలు అవుతున్నాయ‌ని.. మ‌రి మీ పెళ్లి ఎప్పుడు అని అడ‌గ‌గా.. అంద‌రికి క‌రోనా వ‌చ్చింద‌ని.. నాకూ రావాలా? అంటూ స‌మాధానం ఇచ్చింది. కాగా సోనాక్షి పెళ్లిపై ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌స్తుతం బంటి స‌చ్ దేవ్ అనే వ్య‌క్తితో డేటింగ్ లో ఉన్న‌ట్లు త‌ర్వలో పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం.

Sonakshi Sinha blue gown with stunning looks

Sonakshi Sinha blue gown with stunning looks

కాగా బంటి స‌చ్ దేవ్ స‌ల్మాన్ ఖాన్ త‌మ్ముడికి బావ అవుతాడు.కాగా సోనాక్షి త‌న గ్లామ‌ర్ తో కుర్ర‌కారుని క‌ట్టిప‌డేస్తోంది. వ‌రుస ఫొటో షూట్స్ తో మ‌తి పోగొడ‌తోంది. ఆ మ‌ధ్య బీచ్ లో బికినీలో అందాల‌తో చెమ‌ట‌లు ప‌ట్టించింది. హాట్ హాట్ ఫొజుల‌తో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల‌ని హీటెక్కిస్తోంది. ప్ర‌స్తుతం సోనాక్షి బ్లూ గౌనులో సెక్సీ లుక్ తో చూపు తిప్పుకోనివ్వ‌డం లేదు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp