Soudarya : చెన్నకేశవరెడ్డి సినిమాకు నో చెప్పిన సౌందర్య.. ఎందుకంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Soudarya : చెన్నకేశవరెడ్డి సినిమాకు నో చెప్పిన సౌందర్య.. ఎందుకంటే?

 Authored By aruna | The Telugu News | Updated on :8 August 2022,10:00 pm

Soudarya : చెన్నకేశవరెడ్డి సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి నటించేందుకు అలనాటి సీనియర్ నటి సౌందర్య ఒప్పుకోలేదట. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. వివి వినాయక్‌ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ విడుదల మంచి విజయం సాధించింది. అయితే, అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఆంధ్రరాష్ట్రాన్ని ఊపేసింది. ఆ సమయంలో ఆగమేఘాల మీద చెన్నకేశవరెడ్డి సినిమాను ఇంద్ర‌కు పోటీగా విడుదల చేశారని టాక్. అప్పటికే దర్శకుడు వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘ఆది’ సినిమాను తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బాలయ్య బాబుతో ‘చెన్నకేశవరెడ్డి’లాంటి పవర్‌ఫుల్ సినిమాను తెరకెక్కించారు.

Soudarya : తల్లి పాత్ర చేస్తే కెరీర్ దెబ్బతింటుందని..

ఈ సినిమాలను ఆగమేఘాల మీద తెరకెక్కించడంతో పాటు స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టకుండా విడుదల చేయడంతో చెన్నకేశవరెడ్డి సినిమా అంచనాలకు కాస్త దూరంలో నిలిచింది. సినిమా బాగుందన్న పేరు వచ్చినా.. ఇంద్ర సినిమాతో పోలిస్తే చెన్నకేశవరెడ్డి సూపర్ హిట్ టాక్ అందుకోలేదు. దీనికి తోడు కేవలం 42 కేంద్రాల్లోనే బాలయ్య సినిమా 100 రోజులు ఆడింది. చెన్నకేశవరెడ్డిలో బాలయ్యకు జోడిగా ట‌బు, శ్రీయ నటించిన విషయం తెలిసిందే. తండ్రి పాత్రలో నటించిన బాలయ్యకు జోడిగా ముందుగా సౌందర్యను సంప్రదించగా స్టోరీ విన్నాక ఆవిడ రిజెక్ట్ చేసిందట.. సౌందర్య హీరోయిన్‌గా చేసిన ఐదు నుంచి ఆరు సినిమాలకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

Soudarya Rejected Balakrishna Chennakesava Reddy Movie

Soudarya Rejected Balakrishna Chennakesava Reddy Movie

ఆ పరిచయంతోనే ఆయన బెంగ‌ళూరు వెళ్లి సౌందర్యకు కథ చెప్పగా తల్లి పాత్ర చేసేందుకు సౌందర్య ఒప్పుకోలేదట. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు తల్లి పాత్రలు చేస్తే ఆ త‌ర్వాత కూడా అదే త‌ర‌హా పాత్ర‌లు వ‌స్తాయ‌ని అందుకే బాలయ్యతో కలసి నటించేందుకు సౌందర్య నో చెప్పిందట.. ఆ త‌ర్వాత దర్శకుడు వివి వినాయ‌క్ ఇదే స్టోరీని బాలీవుడ్ యాక్టర్ ట‌బుకు చెప్ప‌గా ఆమె ఓకే చెప్పేసింది. అలా తండ్రి పాత్ర‌కు జోడీగా ట‌బును తీసుకున్నారు. ఆ తర్వాత కొడుకు పాత్రకు జోడిగా ఫామ్‌లో ఉన్న శ్రీయ‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడంతో సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయినా బాలయ్య కెరీర్‌లో మంచి సినిమాగా నిలిచిపోయింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది