Soudarya : చెన్నకేశవరెడ్డి సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి నటించేందుకు అలనాటి సీనియర్ నటి సౌందర్య ఒప్పుకోలేదట. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ విడుదల మంచి విజయం సాధించింది. అయితే, అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఆంధ్రరాష్ట్రాన్ని ఊపేసింది. ఆ సమయంలో ఆగమేఘాల మీద చెన్నకేశవరెడ్డి సినిమాను ఇంద్రకు పోటీగా విడుదల చేశారని టాక్. అప్పటికే దర్శకుడు వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘ఆది’ సినిమాను తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బాలయ్య బాబుతో ‘చెన్నకేశవరెడ్డి’లాంటి పవర్‌ఫుల్ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలను ఆగమేఘాల మీద తెరకెక్కించడంతో పాటు స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టకుండా విడుదల చేయడంతో చెన్నకేశవరెడ్డి సినిమా అంచనాలకు కాస్త దూరంలో నిలిచింది. సినిమా బాగుందన్న పేరు వచ్చినా.. ఇంద్ర సినిమాతో పోలిస్తే చెన్నకేశవరెడ్డి సూపర్ హిట్ టాక్ అందుకోలేదు. దీనికి తోడు కేవలం 42 కేంద్రాల్లోనే బాలయ్య సినిమా 100 రోజులు ఆడింది. చెన్నకేశవరెడ్డిలో బాలయ్యకు జోడిగా టబు, శ్రీయ నటించిన విషయం తెలిసిందే. తండ్రి పాత్రలో నటించిన బాలయ్యకు జోడిగా ముందుగా సౌందర్యను సంప్రదించగా స్టోరీ విన్నాక ఆవిడ రిజెక్ట్ చేసిందట.. సౌందర్య హీరోయిన్‌గా చేసిన ఐదు నుంచి ఆరు సినిమాలకు వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఆ పరిచయంతోనే ఆయన బెంగళూరు వెళ్లి సౌందర్యకు కథ చెప్పగా తల్లి పాత్ర చేసేందుకు సౌందర్య ఒప్పుకోలేదట. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు తల్లి పాత్రలు చేస్తే ఆ తర్వాత కూడా అదే తరహా పాత్రలు వస్తాయని అందుకే బాలయ్యతో కలసి నటించేందుకు సౌందర్య నో చెప్పిందట.. ఆ తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇదే స్టోరీని బాలీవుడ్ యాక్టర్ టబుకు చెప్పగా ఆమె ఓకే చెప్పేసింది. అలా తండ్రి పాత్రకు జోడీగా టబును తీసుకున్నారు. ఆ తర్వాత కొడుకు పాత్రకు జోడిగా ఫామ్‌లో ఉన్న శ్రీయను ఎంపిక చేసినట్టు తెలిసింది. నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడంతో సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయినా బాలయ్య కెరీర్‌లో మంచి సినిమాగా నిలిచిపోయింది.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.