
Soundarya Life Mystery In Telugu
Soundarya : సినీ ఇండస్ట్రీలో ఓ మెరుపు మెరిసి మాయం అయిన అందాల తార సౌందర్య. అందం, అభినయం రెండూ కలిసిన నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జూనియర్ సావిత్రిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎందరో అగ్రహీరోల సరసన నటించారు. చక్కటి అభినయంతో వెండి తెర ప్రేక్షకులను ఎంతలా ప్రభావితం చేయొచ్చో సౌందర్య నిరూపించారు. 12 ఏళ్ల సినీ ప్రయాణంలో 120 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెక్కు చెదరని స్థానం సంపాదించుకున్నారు. ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయగలదు సౌందర్య. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సౌందర్య ఓ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆమె ప్రయాణం అర్ధాంతరంగా ఎందుకు ముగిసిపోయింది? తను చనిపోయే ముందు ఆఖరి మాటలు ఏం మాట్లాడింది? ఎక్కడికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం.
ఏప్రిల్ 14, 2004. ఉమ్మడి ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి. బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికల బరిలో దిగాయి. అధికారం కోసం అన్ని పార్టీలు సినిమా స్టార్లతో ప్రచారం కొనసాగిస్తున్నాయి. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సీహెచ్ విద్యాసాగర్ రావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయనకు మద్దతుగా సినీ నటి సౌందర్యతో ప్రచారం చేయించేందుకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. 2004 లోనే సౌందర్య బీజేపీలో చేరారు. ఏప్రిల్ 14 శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ వెళ్దామని సౌందర్య నిర్ణయించుకున్నారు. సౌందర్య, ఆమె అన్న అమర్ నాథ్, ఆయన ఫ్రెండ్ రమేశ్ తో కలిసి ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. బెంగళూరులోని ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు సౌందర్య ఫ్యామిలీ. సౌందర్య, తన అన్న, తన ఫ్రెండ్ మాత్రం హెలికాప్టర్ ఎక్కి.. మిగితా వాళ్లు అంతా ఇంటికి బయలుదేరారు.
Soundarya Life Mystery In Telugu
ముగ్గురు హెలికాప్టర్ ఎక్కగానే పైలట్ హెలికాప్టర్ డోర్స్ క్లోజ్ చేశాడు. హెలికాప్టర్ స్టార్ట్ అయింది. ఫ్యాన్ తిరుగుతోంది. పైకి లేచింది. ఒక్కసారిగా హెలికాప్టర్ 50 నుంచి 60 అడుగుల ఎత్తుకు లేచింది. వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వాళ్లు కారు దగ్గరకి వెళ్లిపోయారు. హెలికాప్టర్ తన చుట్టూ తాను రెండు మూడు రౌండ్లు తిరిగింది. హెలికాప్టర్ వేగాన్ని పైలట్ పెంచేలోపే అది అదుపు తప్పింది. అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లి కిందపడటం ప్రారంభమైంది. ఏమైంది అని హెలికాప్టర్ లోని వాళ్లు ప్రశ్నించారు. పైలట్ తిరిగి సమాధానం చెప్పేలోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. రన్ వే మీది నుంచి లేచిన మూడు నిమిషాల్లోనే హెలికాప్టర్ పెద్ద శబ్దంతో నేలకొరిగింది. కింద పడిపోయింది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లోని ఓ యూనివర్సిటీ ప్రాంగణంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.
కాపాడండి అంటూ అందరూ హెలికాప్టర్ నుంచి అరుస్తున్నారు. వాళ్లను కాపాడటం కోసం విమానయాన సిబ్బంది వెళ్లారు. కానీ అంతలోనే హెలికాప్టర్ నుంచి మంటలు చెలరేగాయి. అప్పటికే సౌందర్య చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. హెలికాప్టర్ డోర్లు తెరిచే ప్రయత్నం చేసి వాళ్లను కాపాడబోయేసరికి, హెలికాప్టర్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది. సాయం చేయబోయే సిబ్బంది కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. కొందరు సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇసుక చల్లారు. కానీ.. మంటలు ఆరలేదు. చివరకు హెలికాప్టర్ లో ఉన్న నలుగురు వ్యక్తులు మంటల్లో కాలి ముద్దగా మారిపోయారు. ప్రమాదం జరిగిన 30 నిమిషాల తర్వాత మంటలు ఆర్పారు కానీ.. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగింది. సౌందర్యతో పాటు తన అన్న, అతడి ఫ్రెండ్, పైలట్ నలుగురు మంటల్లో కాలిపోయారు. ఫోన్ ఆధారంగా సౌందర్య డెడ్ బాడీని గుర్తించి అదే రోజు రాత్రి తన అంత్యక్రియలను నిర్వహించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.