Mallemala trp stunts for sridevi drama company gets trolled
Mallemala : మల్లెమాల మీద కొందరికి మంచి అభిప్రాయం ఉంది.. ఇంకొందరికి చెడు అభిప్రాయం ఉంది. బుల్లితెరపై మల్లెమాలది ఓ చరిత్ర. ఎంటర్టైన్మెంట్ షోలు చేయడం, కొత్తగా ఆలోచించడంతో మిగతా వారికంటే మల్లెమాల ఎంతో ముందుంటుంది. అయితే మల్లెమాల మీద ఒక్కోసారి ప్రేక్షకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మల్లెమాల చేసే పనులతో జనాలు విసిగెత్తిపోతోంటారు. ప్రతీసారి జనాలను పిచ్చోళ్లని చేసేందుకు మల్లెమాల వేసే స్టంట్లతో జనాలకు చిర్రెత్తుకొస్తుంటుంది. టీఆర్పీల కోసం జనాలను పిచ్చోళ్లని చేసేందుకు నానా రకాల పాట్లు పడుతుంటారు. అలా ఇప్పుడు తాజాగా మరో కొత్త నాటకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. మంచిగా నడుస్తున్న శ్రీదేవీ డ్రామా కంపెనీకి ఇలాంటి పిచ్చి చేష్టలు, టాస్కులు పెట్టి, కాంట్రవర్సీలకు తెరలేపి, ప్రోమోలను వైరల్ చేయించుకుంటున్నారు. చివరకు షోలో మాత్రం ఏమీ ఉండదు. అది అందరికీ తెలిసిందే. తెలిసినా కూడా అటు మల్లెమాల ఇలాంటి టీఆర్పీ స్టంట్లను మానడం లేదు.
తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కొత్తగా ఓ కాన్సెప్ట్ పెట్టారు. బిగ్ బాస్ షోలో మాదిరిగా.. నచ్చని వాళ్ల ఫోటోలను కాల్చేయాలని టాస్క్ పెట్టారు. ఇందులో అందరూ ఆది ఫోటోనే కాల్చేశారు. రష్మీ, రాం ప్రసాద్.. ఆకరికి పరదేవీ కూడా ఆది ఫోటోనే కాల్చేశాడు. ఇందులో ఎంత నిజం ఉంది.. ఎందుకు చేశారో మాత్రం తెలియడం లేదు.. కానీ ప్రోమోను మాత్రం ఇలా కాంట్రవర్సీగా కట్ చేశారు. దీనిపై జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Mallemala trp stunts for sridevi drama company gets trolled
అయ్యయ్యో వద్దమ్మా! ఇప్పటికే ఇలాంటివి చాలా చూశాం మళ్ళీ అంటే కష్టం, ఇలాంటి ప్రాంకులు చేస్తున్న మల్లమాల టీమ్ కీ, ఇంత వరకు లేని ఈ సంస్కృతి ఇప్పుడు ఎందుకు, అందరూ కలిసి ఉండాలని, కళామతల్లి ముద్దు బిడ్డలై మమ్మల్ని ఆనందింపచేయాలని కోరుతూ…. ఆది అల్ప సంతోషి, ఆది, రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, రష్మీ ఈ షో కి నాలుగు స్థంభాలు, చుాసాం చుాసాం.. చాలా చుాసాం.. ఈ ప్రాంకులు.. ఇవి ప్రోమెా లాస్ట్ లో ప్రతీసారి కామన్ కదా…అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ మల్లెమాలను ఏకిపారేస్తున్నారు.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.