సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ స్పైడర్ ‘ సినిమాలో చిన్నప్పటి విలన్ పాత్రలో నటించిన కుర్రాడు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. 125 కోట్ల బడ్జెట్ తో మురుగదాస్ ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. ఎస్.జె సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఎస్.జె సూర్య చిన్నప్పటి పాత్రలో సంజయ్ అనే అబ్బాయి నటించాడు. ఆ బాల నటుడు ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కనిపించాడు.
అప్పట్లో స్పైడర్ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు పోటీగా విలన్ భైరవుడు అనే క్యారెక్టర్ లో ఎస్ జె సూర్య అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఆయనే హైలైట్ గా నిలిచారు. అతని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే సూర్య చిన్నప్పటి పాత్రలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ సంజయ్ కూడా బాగా నటించాడు. స్మశానంలో పుట్టి పెరిగిన అబ్బాయిగా అద్భుతంగా ప్రదర్శించాడు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత అతడిని స్పైడర్ సంజయ్ అని పిలుస్తున్నారు. ఈ సినిమా తర్వాత సంజయ్ పలు తమిళ సినిమాలలో నటించాడు.

ఇకపోతే సంజయ్ తమిళనాడులో పుట్టి పెరిగారు. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ప్రస్తుతం దానిని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు. ఛానల్ పేరు కుట్టి టాకీస్. ఇందులో తన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫుడ్ రివ్యూలను డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు. సంజయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. పాపులర్ సాంగ్స్ కు కూడా డాన్స్ చేసి ఆ వీడియోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా అతడు విజయ్ దళపతి ‘ వారీసు ‘ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.