Sr NTR – ANR : ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఆరేళ్ల వరకు మాట్లాడుకోలేదట.. ఇరువురి మధ్య గొడవకు కారణం వారేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sr NTR – ANR : ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఆరేళ్ల వరకు మాట్లాడుకోలేదట.. ఇరువురి మధ్య గొడవకు కారణం వారేనా?

 Authored By mallesh | The Telugu News | Updated on :25 September 2022,10:00 pm

Sr NTR – ANR : నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీరిద్దరు తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారని చెబుతుంటారు. చాలా కాలం వరకు ఈ రెండు కుటుంబాలు కలిసే ఉన్నాయి. ఒకరొనొకరు అప్యాయంగా పలకరించుకునేవారు. ఒకటి మాటకు ఒకరు విలువ నిచ్చేవారట. అయితే, వీరిద్దరి మధ్య అనుకోకుండా కొన్నిసార్లు గొడవలు తలెత్తాయట.. దీంతో ఏకంగా ఆరేళ్ల వరకు ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఉన్నారట.. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Sr NTR – ANR : ఇదంతా ఆ పార్టీ పనియేనా..

ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రస్తుతం ఉన్న ఏపీ తమిళనాడులో కలిసి ఉన్న మాట వాస్తవమే. అప్పుడు సినిమా ఇండస్ట్రీలో చెన్నయ్ లో అభివృద్ధి చెందినంత హైదరాబాద్‌లో లేదు. అప్పుడు హైదరాబాద్ నిజాం పాలన నుంచి బయట పడి కొత్త రాష్ట్రంగా అవతరించింది.ఇక్కడ అన్ని సదుపాయాలు ఇంకా రాలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ అంత చెన్నయ్‌లోనే షూటింగ్స్ చేసేవారు. అయితే, అప్పట్లో ఏఎన్నార్ కాంగ్రెస్ పార్టీకి విదేయుడిగా ఉండేవారట.. గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌రరావు తన పుస్తకం ‘తీపి గురుతులు-చేదు జ్ఞాప‌కాలు’లో ఎన్టీఆర్ – ఏఎన్నార్ మధ్య ఎందుకు గొడవలు జరిగాయో విపులంగా రాసుకొచ్చారు. వీరిద్దరూ జిల్లా కృష్ణా నుంచి మ‌ద్రాస్‌కు వెళ్లి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు.

Sr NTR And ANR Doesn't Talk Each Other For Six Years

Sr NTR And ANR Doesn’t Talk Each Other For Six Years

పౌరాణికం, జాన‌ప‌ద చిత్రాల్లో అన్న‌గారు.. సాంఘిక చిత్రాల్లో అక్కినేని ఓ వెలుగు వెలిగారు.ఇక 1960లో అక్కినేని హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. దీనికి కారణం నాటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇక ఆయన సినిమా షూహింట్స్ కూడా ఇక్కడే చేసేవారు. ఎన్టీఆర్ మాత్రం మద్రాసులోనే చేసేవారు. ఎన్టీఆర్ తనవాళ్లను వదిలి హైదరాబాద్ రావడానికి ఇష్టపడలేదు.దీంతో వీరిమధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆరేళ్ల వరకు వీరు మాట్లాడుకోలేదు. దీంతో వీరి అభిమానుల మధ్య కూడా దూరం పెరిగింది. ఆ తర్వాత కొంత కాలానికి ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేశారట.. దీంతో ఇరువురి మధ్య మళ్లీ మాటలు కలిసి సినిమాలు చేశారని గుమ్మడి తన పుస్తకంలో రాసుకొచ్చారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది