SR NTR : అతను ప్రతిరోజు పదిమంది అమ్మాయిలతో తిరిగేవాడు.. సీక్రెట్స్ బయట పెట్టిన ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసయ్య..!
ప్రధానాంశాలు:
SR NTR : అతను ప్రతిరోజు పదిమంది అమ్మాయిలతో తిరిగేవాడు.. సీక్రెట్స్ బయట పెట్టిన ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసయ్య..!
SR NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు వద్ద చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన నరసయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పటి గవర్నర్ ఎన్.డి. తివారి గురించి యాంకర్ అడగగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ డీ తివారి క్యారెక్టర్ అసలు మంచిది కాదని, ఆయన యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయని, ఆయన ఆఫీసుకి పదిమంది అమ్మాయిలు కూడా వచ్చేవారని, అప్పట్లో ఒక ఆవిడ తన కొడుకు ఎండి తివారి వలనే పుట్టాడని కోర్టులో కేసు వేశారు. అప్పటికే ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ అసలు మంచిది కాదు అని నరసయ్య చెప్పుకొచ్చారు.
ఇక ఎన్టీఆర్ వద్ద సెక్యూరిటీ ఆఫీసర్గా చేరకముందు ఆయనతో నాకు పరిచయం లేదని, కేవలం సినిమాలలో చూసానని, అయితే తిరుపతిలో పని చేస్తున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి మొదటిసారిగా సీనియర్ ఎన్టీఆర్ తిరుపతిలో మహానాడు సభను నిర్వహించారు. ఇక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తిరుపతిలో రోడ్ షో చేశారు. ఆ సమయంలో ఒకే కామన్ రోడ్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, సీనియర్ ఎన్టీఆర్ రావాల్సి ఉంది. ఆ సమయంలో నేను వెళ్లి ఎన్టీఆర్ ను కాసేపు ఆగమని చెప్పాను. అప్పుడు ఆయన ఓకే అని చెప్పారు. అప్పుడే నేను తొలిసారిగా ఆయనతో మాట్లాడటం. ఆయన చాలా గొప్ప మనిషి ఇందిరాగాంధీ వస్తున్నారని కాసేపు ఆగారు.
అదే ఇప్పటి వాళ్ళు అయితే వాళ్ళు వస్తే నేను ఆగేదేంటి అని, ముందు నేనే వెళతా అని వెళతారు. కానీ ఎన్టీఆర్ గొప్ప మనిషి అని పొగిడారు. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ మద్రాస్ వెళ్లడానికి తిరుపతి వచ్చారు. అప్పుడు మా డీఎస్పీలు సెక్యూరిటీగా ఉండమని నన్ను పంపించారు. మొదటిసారిగా ఆయనతో మద్రాసు వెళ్లి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చానన్నారు. ఆయన సీఎం అయిన సంవత్సరం తర్వాత అనివర్సరీ ప్రోగ్రాం చేశారు. అప్పుడు ఆయన నన్ను సెక్యూరిటీ ఆఫీసర్గా ఎంచుకున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ఎన్టీఆర్ కొడుకులలో హరికృష్ణ చాలా సింపుల్ గా ఉంటారని, ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు చైతన్య రథానికి డ్రైవర్ గా హరికృష్ణ ఉన్నారని, ఆయన తోటి మనుషులతో చాలా కలివిడిగా ఉండేవారని, ఎన్టీఆర్ కొడుకని కొంచెం కూడా అహంకారం ఉండేది కాదని, నిజమైన డ్రైవర్ లాగే బండి కింద పట్టా వేసుకొని పడుకునే వారని, డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేసేవారని, కానీ దురదృష్టం ఆయన సొంతంగా డ్రైవింగ్ చేస్తునే మరణించడం అందరికీ బాధాకరమని ఆయన తెలిపారు.