Categories: EntertainmentNews

Sravana Bhargavi : పాపం శ్రావ‌ణ భార్గ‌వి.. దిగి రాక త‌ప్ప‌లేదుగా..!

Sravana Bhargavi : శ్రావ‌ణ భార్గ‌వి.. ఇటీవ‌ల ఈ సింగ‌ర్ పేరు తెగ వైర‌ల్ అయింది. కొద్ది రోజుల క్రితం విడాకుల విష‌యంలో శ్రావ‌ణ భార్గ‌వి పేరు హాట్ టాపిక్‌గా మార‌గా, ఇప్పుడు ఆమె పాడిన పాట విష‌యంలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. క‌రాటే క‌ళ్యాణి కూడా ఈ సాంగ్‌పై స్పందించింది. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలే తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు.. శాస్త్రబద్దంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు.

Sravana Bhargavi : త‌గ్గక త‌ప్ప‌లేదుగా..

భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్‌ చేయాల్సిందే!’ అని కరాఖండిగా తేల్చి చెప్పింది కల్యాణి. ఎవ‌రెన్ని మాట్లాడినా కూడా .. ఆమె వెనక్కు తగ్గలేదు.. తన పాటలో అసభ్యత ఏముందని తిరిగి ప్రశ్నించింది. అయితే ఆ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యారు. ఇక శ్రీవారి భక్తులు.. తిరుమల వాసులు సైతం శ్రావణ భార్గవి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు.

sravana bhargavi deleted okapari song

శ్రావణ భార్గవి తీరుపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలువురు నిరసనలు కూడా తెలిపారు. దీంతో చేసేదిలేక శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్‌ నుంచి ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ వీడియోను డిలీట్ చేసింది. శ్రావణ భార్గవి ఓ మెట్టు దిగి ఆ వీడియోను తొలగించడంతో తిరుపతి వాసులు, అన్నమయ్య వంశస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రావ‌ణ భార్గ‌వి ఈ వివాదానికి ఇలా పులిస్టాప్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

Recent Posts

Gym : వ్యాయామ సమయంలో బిగుతైన దుస్తులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసా?

Gym  : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…

57 minutes ago

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

2 hours ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

3 hours ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

4 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

5 hours ago

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

14 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

15 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

16 hours ago