Nagarjuna : రెండు సార్లు పెళ్లైంద‌న్న బిగ్ బాస్ బ్యూటీ… నాగార్జున‌కే దిమ్మ తిరిగే షాకిచ్చింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : రెండు సార్లు పెళ్లైంద‌న్న బిగ్ బాస్ బ్యూటీ… నాగార్జున‌కే దిమ్మ తిరిగే షాకిచ్చింది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :28 February 2022,8:20 am

Nagarjuna : బిగ్ బాస్ ప్రియులు ఎప్పుడా ఎన్న‌డా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ కార్య‌క్ర‌మం రీసెంట్‌గా లాంచ్ అయింది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో 24*7 నాన్‌ స్టాప్‌గా ఈ షో ప్రసారం అవుతోంది. ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. ఈ షోని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయోచ్చు. ఓటీటీ షోలో గత సీజన్లకి సంబంధించిన కంటెస్టెంట్ లు వారియర్స్ గా, కొత్తగా వచ్చే వారు చాలెంజర్స్ గా పిలవబడతారు అంటూ నాగార్జున ప్రకటించారు. అందులో భాగంగా మొదట అషు రెడ్డి, ఆ తర్వాత మహేష్ విట్టా, ఆ తర్వాత ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇవ్వగా నాలుగో హౌస్ మేట్ గా అజయ్ కుమార్ కతుర్వార్ అనే హీరో ఎంట్రీ ఇచ్చాడు.

అనంత‌రం మరో చాలెంజర్ గా యాంకర్ స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది. ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో అడ‌పాద‌డ‌పా మెరుస్తుంటుంది. కాని అంత‌గా ప‌రిచ‌యం లేదు. అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి చాలా సుప‌రిచితం. అయితే బిగ్ బాస్ ఓటీటీ స్టేజ్ మీద అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పెద్ద షాక్ ఇచ్చింది. తనకు వివాహం జరిగిందనే విషయాన్ని నాగార్జునతో పాటు వేదిక మీద ఉండగానే ప్రకటించింది. నీ గురించి ప్రపంచానికి తెలియని విషయం ఏదైనా చెప్పమని నాగార్జున అడిగితే తనకు రెండు సార్లు వివాహం అయిందని చెప్పుకొచ్చింది.

sravanthi chokarapu comments on Nagarjuna

sravanthi chokarapu comments on Nagarjuna

Nagarjuna  : సీక్రెట్ బ‌హిర్గ‌తం చేసిందిగా..

అదేమిటి అని అడిగితే తాను ప్రేమించి పారిపోయి ఒకసారి పెళ్లి చేసుకున్నామని ఒప్పుకున్న తర్వాత మరోసారి వివాహం జరిగిందని ఆమె పేర్కొంది.త‌న‌కు పెళ్లైన విష‌యం చాలా మందికి తెలియ‌ద‌ని స్ర‌వంతి పేర్కొంది. తాను అనంతపురం జిల్లా కదిరి అని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయిని అని ఆ అబ్బాయి మాత్రం తెలంగాణ అబ్బాయి అని చెప్పుకొచ్చింది. నేను నచ్చక పోవడం కాదు కానీ కులాలు వేరు కావడంతో మొదటి వివాహం చేయడానికి ఇబ్బంది పడ్డారు కానీ వాళ్ల ఇంటి పేరుని సగర్వంగా చెప్పుకునే విధంగా చేయడంలో తాను గర్వపడుతున్నానని అని ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది