Sreeja Konidela : సంతోషంగా బతకడానికి కారణాలివే.. శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreeja Konidela : సంతోషంగా బతకడానికి కారణాలివే.. శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్..

Sreeja Konidela : ఇటీవల కాలంలో సెలబ్రిటీల డైవోర్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరుగుతోంది. దానికి తోడు సెలబ్రిటీలు విడాకుల ప్రకటనలు సోషల్ మీడియా వేదికగానే వస్తుండటంతో ఏ చిన్న మార్పు వచ్చినా.. వాళ్లు డైవోర్స్ తీసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కల్యాణ్ కూడా డైవోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.శ్రీజ కొణిదెల డైవోర్స్ తీసుకోబోతున్నదని […]

 Authored By mallesh | The Telugu News | Updated on :1 February 2022,7:40 am

Sreeja Konidela : ఇటీవల కాలంలో సెలబ్రిటీల డైవోర్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరుగుతోంది. దానికి తోడు సెలబ్రిటీలు విడాకుల ప్రకటనలు సోషల్ మీడియా వేదికగానే వస్తుండటంతో ఏ చిన్న మార్పు వచ్చినా.. వాళ్లు డైవోర్స్ తీసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కల్యాణ్ కూడా డైవోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.శ్రీజ కొణిదెల డైవోర్స్ తీసుకోబోతున్నదని వార్తలు రావడానికి గల కారణం.. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో …. శ్రీజ కల్యాణ్ అని ఉన్న తన పేరును శ్రీజ కొణిదెలగా మార్చుకుంది.

అది గమనించిన నెటిజన్లు.. ఇదే సంకేతమని అంటున్నారు. అయితే, ఈ విషయమై మెగా ఫ్యామిలీ నుంచి కాని కల్యాణ్ దేవ్ నుంచి కాని ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. గతంలో సమంత తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పేరును సమంత అక్కినేని నుంచి సమంత రూత్ ప్రభుగా మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే శ్రీజ కూడా డైవోర్స్ ఇవ్వబోతున్నదనే చర్చ జరుగుతున్నది. ఈ సంగతులు అలా ఉంచితే… శ్రీజ కొణిదెల తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు చర్చనీయాంశమవుతోంది.తన అన్నయ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో కలిసి ముంబైకి హాలీడేకు వెళ్లిన శ్రీజ కొణిదెల.. అక్కడ చెర్రీతో దిగిన ఫొటోను ఇన్ స్టా వేదికగా పంచుకుంది.

sreeja konidela emotional post on instagram

sreeja konidela emotional post on instagram

‘ఇవే కౌగిలింతలు.. నేను సంతోషంగా బతుకుతున్నానని చెప్పడానికి కారణాలివే’ అని పేర్కొంటూ ఫొటో పోస్ట్ చేసింది. శ్రీజ కొణిదెల పెట్టిన క్యాప్షన్ చూసి ఆమె చాలా ఎమోషనల్ అయిందని నెటిజన్లు అంటున్నారు. శ్రీజ హాలీడేకు తన భర్తతో కాకుండా అన్నయ్యతో ఎందుకు వెళ్లిందని ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ ఫొటో చూసి శ్రీజ కొణిదెల అక్క సుస్మిత కొణిదెల తనను వదిలేసి ముంబైకి హాలీడేకు వెళ్లిపోయినందుకు థాంక్స్ అని కామెంట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది