Sreeja konidela : నేను తప్పు చేశాను, క్షమించండి నాన్న.. శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreeja konidela : నేను తప్పు చేశాను, క్షమించండి నాన్న.. శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్..!

 Authored By aruna | The Telugu News | Updated on :7 November 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Sreeja konidela : నేను తప్పు చేశాను, క్షమించండి నాన్న.. శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్..!

Sreeja konidela : మెగా డాటర్ శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటారు. రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరికీ విడాకులు విచ్చేసిన శ్రీజ అంటే అందరికీ చిన్న చూపే. అయితే ఆమె ఒక ఆడపిల్ల అని, ఆమెకు ఒక మనసు ఉంటుందని మర్చిపోయారు ట్రోల్ చేసేవారు. మెగా ఇంట్లో ఏం జరిగినా ఏం చేసినా ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి పెళ్లిలో ఆమె దిగిన ఫోటోలు చూసి ఆమెను చాలా దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో బాధపడిపోయిన శ్రీజ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

విషయాలు నియంత్రణలో లేనప్పుడు పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్నప్పుడు హృదయం గాయపడుతుంది, విరిగిపోతుంది మనసు కలత చెందుతుంది, క్షీణిస్తుంది. శరీరం ఇంకా ఇంకా అలసిపోతుంది. నా కళ్ళు మూసుకుని నిర్మలమైన అంతర్గత ప్రపంచానికి కనెక్ట్ అవుతాను అంటూ తలుచుకుంటూ ఉంటాను ఇదొక్కటే మార్గం అంటూ ఆమె సుదీర్ఘంగా పోస్ట్ చేశారు. ఈ పోస్టు ద్వారా ఆమె చాలా ఎమోషనల్ అవుతుందని ఇకనైనా ట్రోల్ చేయడం ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫాన్స్. నిజానికి విడాకుల విషయం లో శ్రీజని తప్పు పట్టలేం మరి ఆమెను మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు.

ఆమె మనిషే కదా, కొంచమైనా ఆలోచించండి అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. విడాకుల విషయంలో శ్రీజ ఒక్కదానిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు కళ్యాణ్ దేవ్ తప్పు కూడా ఉండి ఉండొచ్చు కదా ఆమెనే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. ఆడపిల్ల అనా అని మరికొందరు సీరియస్ గా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా శ్రీజ వ్యక్తిగతంగా చాలా విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆమె రెండు పెళ్లిళ్లు సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి వరుణ్, లావణ్య కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో శ్రీజ కూడా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది