Sreeleela : ప్రియుడితో ఫారెన్‌లో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల.. ఫోటోలు చూసి అవాక్కవుతున్న నెటిజన్స్
Sreeleela : కొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది శ్రీలీల. గతేడాది ఆమె నటించిన 4 సినిమాలు విడుదలైతే అందులో ఒక్క భగవంత్ కేసరి మినహా మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం హిట్ అయినా క్రెడిట్ మొత్తం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఖాతాలోకి వెళ్లిపోవడంతో ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ […]
ప్రధానాంశాలు:
Sreeleela : ప్రియుడితో ఫారెన్‌లో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల.. ఫోటోలు చూసి అవాక్కవుతున్న నెటిజన్స్
Sreeleela : కొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది శ్రీలీల. గతేడాది ఆమె నటించిన 4 సినిమాలు విడుదలైతే అందులో ఒక్క భగవంత్ కేసరి మినహా మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం హిట్ అయినా క్రెడిట్ మొత్తం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఖాతాలోకి వెళ్లిపోవడంతో ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు.ఈ సినిమా హిట్టైతేనే శ్రీలీలకి మళ్లీ తెలుగులో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అందాల అరబోత కన్నా కథ, సినిమాలో తన క్యారెక్టర్‌కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తానని చాలామంది హీరోయిన్ల మాదిరే శ్రీలీల చెబుతున్నారు.
Sreeleela అతను ఎవరు ?
ఈ ఏడాది జూన్‌లో తన 23వ పుట్టినరోజును జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తోంది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ వంటి సినిమాలు చేసినా ఆమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్, తమిళ్‌లో అజిత్‌తో గుడ్ బాడ్ అగ్లీలో నటిస్తోంది. బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం ‘దిలర్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. అయితే శ్రీలలకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్ చేస్తుంది. ఆమె తన ప్రియుడితో విదేశాలకి చెక్కినట్టు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలీల ఒక్కతే కాదు ఆమె తన ప్రియుడితో కలిసి ఫారిన్ ట్రిప్ వేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటో ద్వారా మరొక అనుమానం కలుగుతుంది అభిమానులకు.అదేంటంటే.. శ్రీ లీల తను షేర్ చేసిన ఫోటోలో ఎవరో ఒక అబ్బాయి తో మాట్లాడుతున్న ఫోటో కనిపించింది. అయితే ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఆ ఫోటోలు చూసి ఆ ఫోటోలో ఉన్నది శ్రీలీల బాయ్ ఫ్రెండే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరి కొంతమందేమో అలా యాక్సిడెంటల్ గా మాట్లాడింది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజముందో తెలియదు