Sreemukhi : శ్రీముఖినా, మ‌జాకానా… అద‌ర‌గొట్టేసింది, అంతే..!

Authored By Sam C | The Telugu News | Published on: May 13, 2022, 6:00 pm

Sreemukhi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు శ్రీముఖి. సినిమాల‌లో న‌టిస్తున్న స‌మ‌యంలో యాంక‌ర్ అవ‌కాశం రావ‌డంతో ఇటువైపు వ‌చ్చేసింది. ‘పటాస్’ కామెడీ షోతో శ్రీముఖి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైంది. ఈ షోతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర రాములమ్మగా పేరొందింది. ఇప్పుడు బుల్లితెర షోలు చేస్తూనే మ‌రోవైపు వెండితెర‌పై కూడా అదృష్టం ప‌రీక్షించుకుంటూ ఉంటుంది. ‘జులాయి’ సినిమాలో బన్నీ చెల్లులు పాత్ర పోషించిన శ్రీముఖి అప్పటి నుంచి ఏదోక సినిమాలో కనిపిస్తూనే వస్తోంది. ఇలా అటు బుల్లితెరపై పలు షోలతో నవ్వులూ పూయిస్తూనే.. మరోవైపు బిగ్ స్క్రీన్ పై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది.

మరోవైపు శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది.శ్రీముఖి ఇటీవ‌ల త‌న 29వ బ‌ర్త్‌డేని ఘ‌నంగా జ‌రుపుకుంది. తన సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. తన సోదరుడు, అమ్మ, స్నేహితుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆచార్య‌లోని సాంగ్‌కి చిందులేసి త‌న అభిమానుల‌ని అల‌రించింది. ఎప్పుడు అభిమానులకి ద‌గ్గ‌ర‌గా ఉంటూ అల‌రిస్తూ ఉంటుంది.తాజాగా శ్రీముఖి స‌న్నని న‌డుము చూపిస్తూ మ‌తులు పోగొట్టే విధంగా చిందులు వేసింది.

sreemukhi dance video very crazy

sreemukhi dance video very crazy

Sreemukhi : శ్రీముఖి హంగామా..!

శ్రీముఖి ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ఇంత ఎన‌ర్జీ ఎలా వ‌చ్చిందో అర్ధం కావ‌డం లేదంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీముఖి వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్’, నితిన్ ‘మాస్ట్రో’లో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు తెచ్చుకుంది. అలాగే, ఇప్పుడు ‘భోళా శంకర్’ సహా ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది.సోషల్ మీడియాలో శ్రీముఖి ఎక్కువగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. అందులో గ్లామర్ ట్రీట్‌ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో మాయ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Sam C

No bio available for this author.

  1. "Aadarsha Kutumbam Movie Review : ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  2. "Jabardasth : చంటికి రావాల్సిన ఆఫర్లు భాస్కర్ కొట్టేస్తున్నాడా?.. నూకరాజు షాకింగ్ కౌంటర్!"

  3. "Women on Bikes : మహిళలు బైక్‌పై రెండు కాళ్లు ఒకే వైపు ఎందుకు పెడతారు? దీని వెనుక ఆసక్తికర చరిత్ర!"

  4. "Annadata Sukhibhava PM Kisan : ఏపీ రైతులకు డబుల్ ధమాకా.. అకౌంట్‌లోకి ఒకేసారి రూ.6 వేలు..!"

  5. "Sai Pallavi : కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. జీవిత భాగస్వామిపై సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్..!"

  6. "AP Weather Alert : ఏపీకి మరో వాన గండం.. అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలకు ఛాన్స్!"

  7. "Konda Surekha KTR : బిగ్ బ్రేకింగ్‌.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp