Sreemukhi : పాటల షోల్లోనూ పొట్టి బట్టలు.. శ్రీముఖి బుల్లి గౌనుపై ట్రోల్స్
Sreemukhi : శ్రీముఖి బుల్లితెరపై కనిపించే విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు శ్రీముఖి నిండైన వస్త్రాధారణతో కనిపించేది. కానీ రాను రాని వాటి సైజులో మార్పు వస్తోంది. ఇప్పుడు ఏకంగా మోకాళ్ల పైకి, తొడలు కనిపించే వరకు పరిస్థితి వచ్చింది. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై మంచి ఫాంలో ఉంది. ఇటు ఈటీవీ, అటు జీ తెలుగు మధ్యలో స్టార్ మా స్పెషల్ ఈవెంట్లు అంటూ బాగానే బిజీగా గడుపుతోంది. బిగ్ బాస్ తరువాత ఈ రేంజ్‌లో ఇప్పుడు మాత్రమే బిజీగా ఉంటోంది. ఆ మధ్య శ్రీముఖి చేసిన షోలన్నీ మధ్యలోనే ఆగిపోతూ వచ్చాయి. బిగ్ బాస్ షోతో శ్రీముఖికి కాస్త నెగెటివిటీ వచ్చింది.
దాంతో ఆమె మూడో సీజన్ రన్నర్‌గానే నిలిచింది. అలా శ్రీముఖి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చేసిన షోలన్నీ అర్దాంతరంగా ఆగిపోయాయి. స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ అని చేసింది. అదీ మధ్యలోనే ఖతమైంది. అదిరింది, బొమ్మ అదిరింది అని శ్రీముఖి చేసింది. అవి కూడా మధ్యలోనే ఆగిపోయాయి. అలా మొత్తానికి శ్రీముఖి ఒకానొక దశలో బుల్లితెరపై కనిపించకుండా పోయింది. ఇక ఇప్పుడు మళ్లీ ఆమెకు పున: వైభవం వచ్చింది. మొత్తానికి శ్రీముఖి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. అయితే శ్రీముఖి మాత్రం ఇప్పుడు తన డ్రెస్సింగ్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. శ్రీముఖి వేసే దుస్తులు మరీ పొట్టిగా తయారవుతున్నాయి.

Sreemukhi Dressing In Zee Sa re Ga Ma Singing Show
అది కూడా పాటల కార్యక్రమంలో. పాటల షోలో ఇలాంటి వస్త్రాధారణ అవసరమా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మొన్నామధ్య శ్రీముఖి డ్రెస్ మరింత తగ్గిపోయింది. ఇక ఆమె తొడలు కూడా క్లియర్‌గా కనిపిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రోమోలోనూ అలాంటి బట్టలే ధరించింది. ఫ్యాన్స్ స్పెషల్ షో అంటూ అభిమానుల కోరిక మేరకు పాటలు పాడించారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి ధరించిన బుల్లి గౌను మళ్లీ చర్చకు తెరలేపింది.సింగింగ్ షోలో ఇలాంటి వస్త్రాధారణ ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి షో ఏదైనా సరే హోస్టులు మాత్రం ఇలాంటి బట్టలే వేసుకోవాలని అందరూ భావిస్తున్నారేమో.
