Sreemukhi : శ్రీ‌ముఖిని లాగిపెట్టి కొట్టిన ముక్క అవినాష్‌.. కార‌ణం కార్తీక దీపం డాక్టర్ బాబు వంటలక్కేన‌ట‌..! వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : శ్రీ‌ముఖిని లాగిపెట్టి కొట్టిన ముక్క అవినాష్‌.. కార‌ణం కార్తీక దీపం డాక్టర్ బాబు వంటలక్కేన‌ట‌..! వీడియో

Sreemukhi : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘కార్తీక దీపం’ సీరియల్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా తెలుగిండ్లలో ఈ సీరియల్ చూసిన తర్వాత చానల్ మారుతుందనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక డాక్టర్ బాబు-వంటలక్క మధ్య జరిగే సంభాషణలు చూసేందుకుగాను మహిళలు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల, వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ తెలుగునాట బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఈ సీరియల్‌లో మధ్య తరగతి అనుంబంధాలు ప్రతిబింబిస్తాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.ఈ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :25 August 2021,6:59 pm

Sreemukhi : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘కార్తీక దీపం’ సీరియల్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా తెలుగిండ్లలో ఈ సీరియల్ చూసిన తర్వాత చానల్ మారుతుందనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక డాక్టర్ బాబు-వంటలక్క మధ్య జరిగే సంభాషణలు చూసేందుకుగాను మహిళలు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల, వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ తెలుగునాట బాగా పాపులర్ అయ్యారు.

Sreemukhi Fun With avivash karthika deepam

Sreemukhi Fun With avivash karthika deepam

ముఖ్యంగా ఈ సీరియల్‌లో మధ్య తరగతి అనుంబంధాలు ప్రతిబింబిస్తాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.ఈ క్రమంలోనే ‘మధ్య తరగతి కుటుంబ బంధాలు’ పేరిట జబర్దస్త్ స్టార్ ముక్కు అవినాష్, యాంకర్ శ్రీముఖి ఇన్ స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. అందులో డాక్టర్ బాబు, వంటలక్కను వీరిరువురు ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Sreemukhi శ్రీముఖి తలపై ఒక్క దెబ్బ కొట్టిన ముక్కు అవివాష్.. ఏం జరిగిందంటే?

 

Sreemukhi Fun With avivash karthika deepam

Sreemukhi Fun With avivash karthika deepam

డాక్టర్ బాబు, వంటలక్క కలవాలని కోరుకుంటు ఈ వీడియో చేసినట్లు శ్రీముఖి అవినాష్ కోరుకుంటున్నారు. ఈ మేరకు వారు క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియో ద్వారా తన తల్లి డెబ్యూ అవుతున్నదని శ్రీముఖి పేర్కొనడం గమనార్హం. ఇన్ స్టా రీల్స్‌లో భాగంగా షేర్ చేసిన ఈ వీడియోకు ‘రీల్ చేయ్యు ఫీల్ అవ్వు’అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు.ఇకపోతే వీడియోలో ముక్కు అవినాష్, SREEMUKHI..సంభాషణలు మ్యూట్‌లో ఉండగా, శ్రీముఖిని కొద్ది సేపు బతిమిలాడిన అవినాష్ కొద్ది సేపటి తర్వాత తలపైన ఒక్కటి కొడతాడు.

Karthika Deepam 25 August 2021 Wednesday episode 1127 highlights

Karthika Deepam 25 August 2021 Wednesday episode 1127 highlights

ఆ తర్వాత వారిద్దరూ కలిసిపోతారు.మధ్య తరగతి అనుబంధాలు ఇలాగే ఉంటాయని సంకేతాలు వీడియో ద్వారా ఇచ్చారు వీరిరువురు. ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి, అవినాష్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ‘శ్రీముఖి ఎక్స్‌ప్రెషన్స్ సూపర్, కిర్రాక్ అస్సలు’ అనే కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది