Sreemukhi : పెళ్లిపై స్పందించిన యాంకర్.. అప్పుడే చేసుకుంటానన్న శ్రీముఖి
Sreemukhi : శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. మామూలుగా అయితే శ్రీముఖే ఆ మధ్య ఓ షోలో వచ్చినప్పుడు తన పెళ్లి గురించి చెప్పింది. సుమ హోస్ట్ చేసిన క్యాష్ షోలో శ్రీముఖి ఓసారి గెస్టుగా వచ్చింది. ఆ సమయంలోనే శ్రీముఖి తన పెళ్లి గురించి కామెంట్ చేసింది. తాను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతాను అని, రెండేళ్లలే అది జరుగుతుందని కూడా చెప్పేసింది. అయితే శ్రీముఖికి ఇంకా పెళ్లి ఘడియలు రానట్టు కనిపిస్తోంది.

Sreemukhi On Her Maariage
విష్ణుప్రియ, శ్రీముఖి ఇద్దరూ కూడా తమకు రాబోయే వాడు ఎలా ఉంటాడా? అని రోజూ కలలు కంటారట. ఇద్దరూ రాబోయే వాడి గురించి ముచ్చట్లు పెట్టుకుంటారట. త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని అనుకుంటున్నారట. అయిత తాజాగా శ్రీముఖి తన ఇన్ స్టాగ్రాంలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెట్టింది. ఏదైనా అడగండి అంటూ శ్రీముఖి తన అభిమానులను అడిగింది. దీంతో కొందరు అవినాష్ పెళ్లి ఎప్పుడు అని అడిగారు. అక్టోబర్ 20న పెళ్లి, జగిత్యాలలో 24న రిసెప్షన్ అని చెప్పింది.
Sreemukhi : శ్రీముఖి పెళ్లి అప్పుడే..

Sreemukhi On Her Maariage
ఇక నీ పెళ్లి ఎప్పుడు అని తన ఫ్రెండ్ ఇరికించే ప్రయత్నం చేసినట్టుంది. దానికి ఆన్సర్ చెబుతూ.. నుమ్ ముందు చేసుకో.. మంచి బాయ్ ఫ్రెండ్‌ను చూసి పెళ్లి చేసుకో ప్రియాంక.. ఆ తరువాత నేను పెళ్లి చేసుకుంటాను. ఆ పెళ్లిలో నువ్వే నాకు నెయిల్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది అని తన ఫ్రెండ్ ప్రియాంకకు శ్రీముఖి కౌంటర్ వేసింది. మొత్తానికి శ్రీముఖి కూడా పెళ్లి చేసుకునేందుకు సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అది ఇండస్ట్రీలోని వ్యక్తినా? లేదా బయటి వ్యక్తా? అన్నది తెలియాలి.