Sreemukhi : బుల్లి నిక్కర్లో రాములమ్మ.. సింగర్లతో కలిసి చిందులు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 30 June 2022, 8:00 pm

Sreemukhi : బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది. బుల్లితెరపై ప్రస్తుతం యాంకర్‌గా దూసుకుపోతోంది శ్రీముఖి. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానెల్స్‌లో శ్రీముఖి ఏదో ఒక షో చేస్తూ బిజీగా ఉంటోంది. ఈమె కెరీర్‌లో బిగ్ బాస్ షో అనేది ఓ మచ్చలా మిగిలిపోయింది. బిగ్ బాస్ షో కంటే ముందు శ్రీముఖికి ఫుల్ పాపులారిటీ ఉండేది. కానీ బిగ్ బాస్ షో వల్ల కాస్త నెగెటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. ఆ షోలో శ్రీముఖి రన్నర్‌గా మిగిలింది. బిగ్ బాస్ తరువాత శ్రీముఖి కెరీర్ కాస్త నత్తనడకన సాగింది. ఆమె చేసిన ప్రతీ షో అటకెక్కింది.

మళ్లీ ఇప్పుడిప్పుడే కాస్త దారిలో పడుతోంది శ్రీముఖి. ఈటీవీలో పటాస్ లాంటి షోను మళ్లీ ముందుకు నడిపిస్తోంది. జాతిరత్నాలు అంటూ శ్రీముఖి సందడి చేస్తోంది. స్టార్ మాలో స్పెషల్ ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాంలను హోస్ట్ చేస్తోంది. జీ తెలుగులో సరిగమప అనే షోను నడిపస్తోంది. ఇలా బుల్లితెరపై శ్రీముఖి బాగానే బిజీగా ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో అయితే శ్రీముఖి నిత్యం యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. శ్రీముఖి ఎక్కువగా డ్యాన్సులతో ఫేమస్ అయింది. ఆమె వేసే స్టెప్పులు మామూలుగా ఉండవు.

Sreemukhi Reels With Singers Harika Narayan Ramya Behera

Sreemukhi Reels With Singers Harika Narayan Ramya Behera

ఆ మధ్య శ్రీముఖి శేఖర్ మాస్టర్ కలిసి చేసిన రీల్ వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అలా శ్రీముఖి చేసే రీల్ వీడియోలు ఎక్కువగా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. అయితే శ్రీముఖి ఎక్కువగా పొట్టి బట్టల్లోనే కనిపిస్తుంటుంది. బుల్లి నిక్కర్లు వేసుకుని ఆమె చేసే రీల్ వీడియోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా శ్రీముఖి అలాంటి ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో చాలా మంది సింగర్లున్నారు. సరిగమప షోతో ఫేమస్ అయిన హారికా నారాయణన్, రమ్య బెహెరా వంటి వారున్నారు. ఇలా అందరూ కలిసి చేసిన ఈ రీల్ వీడియోలు శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఎందుకంటే ఆమె ఒక్కతి మాత్రమే బుల్లి నిక్కర్ ధరించింది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి