Sreemukhi : హీరోయిన్స్‌ని మించిన అందం.. శ్రీముఖి హొయ‌లు సెగ‌లు రేపుతున్నాయిగా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sreemukhi : హీరోయిన్స్‌ని మించిన అందం.. శ్రీముఖి హొయ‌లు సెగ‌లు రేపుతున్నాయిగా..!

Sreemukhi : బుల్లితెర యాంక‌ర్ శ్రీముఖి ఇటీవ‌లి కాలంలో త‌న అంద‌చందాల‌తో సెగ‌లు రేపుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి అందాల దాడి చేస్తుంది. టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. సోష‌ల్ మీడియాలో ఈ యాంక‌రమ్మ ర‌చ్చ పీక్స్‌లో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :26 June 2022,4:30 pm

Sreemukhi : బుల్లితెర యాంక‌ర్ శ్రీముఖి ఇటీవ‌లి కాలంలో త‌న అంద‌చందాల‌తో సెగ‌లు రేపుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి అందాల దాడి చేస్తుంది. టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. సోష‌ల్ మీడియాలో ఈ యాంక‌రమ్మ ర‌చ్చ పీక్స్‌లో ఉంటుంది. కొద్ది రోజులుగా తెగ అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్న శ్రీముఖి కేక పెట్టించే అందంతో కైపెక్కిస్తుంది.

చీర‌క‌ట్టులో కూడా సెగ‌లు రేపాలంటే ఈ విధంగా ఉండాలి అన్న‌ట్టు శ్రీముఖి గ్లామ‌ర్ షో చేసింది. శ్రీముఖిని ఇలా చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.జ‌బ్బ‌లు క‌నిపించేలా శ్రీముఖి అందాల ఆర‌బోత పీక్స్ లో ఉంది. ప్ర‌స్తుతం పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మొదట సినీ నటిగా శ్రీముఖి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె హీరో సిస్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆమె నటిగా పలు రకాల విభిన్నమైన సినిమాలు చేసింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమే కాకుండా లీడ్ రోల్స్ కూడా చేసింది.

sreemukhi saree pics are stunning

sreemukhi saree pics are stunning

Sreemukhi : మ‌త్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ‌

కానీ ఆ రూట్లో ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. యాంక‌ర్‌గా టర్న్ తీసుకున్న త‌ర్వాత శ్రీముఖి చెల‌రేగిపోతుంది. పటాస్ షో ద్వారా శ్రీముఖి మంచి క్రేజ్ అందుకుంది. యాంకర్ రవితో కలిసి చేసిన ఆ షోలో శ్రీముఖి ఒక వైపు అందంతో ఆకట్టుకుంటూనే మరోవైపు తన మాటలతో పంచ్ లతో డైలాగ్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అప్పట్లో ఆ షోకు యూత్ లో మంచి క్రేజ్ దక్కింది కూడా శ్రీముఖి కారణంగానే. ఇక ఆ షో అనంతరం ఎన్నో షోలు చేసినప్పటికీ అవేవి కూడా అంతగా క్లిక్కవ్వలేదు. బిగ్ బాస్ షోతో మ‌రింత ఆద‌ర‌ణ అందిపుచ్చుకున్న ఈ అమ్మ‌డు ప‌లు షోస్‌తో పాటు భోళా శంక‌ర్ వంటి సినిమాల‌లోను న‌టిస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది