Mahesh Babu : మహేశ్ బాబు ఎత్తుకున్న ఈ పాప ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తుందని మీకు తెలుసా!
Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చిన్నవయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారంతా ప్రస్తుతం హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు.0వీరిలో కొందరు సూపర్ స్టార్స్‌తో కూడా నటించారు. బాలనటులుగా గుర్తింపు తెచ్చుకున్న వారంతా ఇప్పుడు పలు ఇండస్ట్రీల్లో హీరోయిన్లుగా మంచి స్థాయికి చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.మరికొందరేమో సినిమాలకు దూరంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ తమ జీవితంలో బిజీగా మారిపోయారు…
అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ బాలనటి పలు సినిమాల్లో నటించింది. షూటింగ్ సమయంలో ముద్దుగా కనిపించిన ఈ పాపను మహేశ్ కూడా ఎత్తుకుని ముద్దు చేశారు. అప్పుడు ఆ బాల నటికి మూడు సంవత్సరాలు. పలు సీరియల్స్‌లో కూడా నటించింది. ఏడేళ్ల వయసు వచ్చేసరికి సినిమాల్లో అడుగు పెట్టింది. హనుమాన్ జంక్షన్ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.అదే ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు మూవీలో కూడా నటించింది..
Mahesh Babu : 2010లో హీరోయిన్ గా ఎంట్రీ..
ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన వీడే సినిమాలో నటించి ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టింది. చదువు పూర్తయిన వెంటనే 2010లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమిళ్ ఇండస్ట్రీలో, శివ కార్తికేయన్, కార్తీ, జీవి ప్రకాష్ కుమార్ వంటి హీరోల సరసన నటించింది. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఆ హీరోయిన్ ఇప్పుడు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె మరెవరో కాదు శ్రీదివ్య.
తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది.హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఈ హీరోయిన్ మారుతి డైరెక్షన్‌లో బస్‌స్టాప్ మూవీలో కూడా నటించి కమర్షియల్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వారధి, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, కేరింత వంటి సినిమాల్లో నటించి మరోవైపు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చింది.
చాలా చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను మాత్రం ఈ బ్యూటీ అందుకోలేకపోయింది. సినిమా అవకాశాలు వస్తున్నా అనుకున్నంతగా గుర్తింపు దక్కడం లేదు. ప్రస్తుతం జనగణమన అనే మలయాళ మూవీలో అతిథి పాత్రలో నటించి మెప్పించింది.ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు యువరాజు మూవీలో చిన్ననాటి శ్రీదివ్యను ఎత్తుకున్న ఫోటో ప్రస్తుతం వయసులో ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కూడా తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు.