Nagarjuna – Sri Laxmi : నాగార్జున అలా చేయడం వల్లనే తట్టుకోలేక విడాకులు ఇచ్చేసిన మొదటి భార్య శ్రీలక్ష్మి?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: April 19, 2023, 1:00 pm

Nagarjuna – Sri Laxmi : టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున గురించి తెలుసు కదా. నాగార్జున టాలీవుడ్ లో కింగ్ కానీ.. పర్సనల్ లైఫ్ మాత్రం కొంచెం డిస్టర్బ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. నాగార్జున తన మొదటి భార్యతో విడాకులు తీసుకొని ఆ తర్వాత టాలీవుడ్ నటి అమలను పెళ్లి చేసుకున్నారు. దగ్గుబాటి రామానాయుడు కూతురు శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున.. నాగాచైతన్య పుట్టిన తర్వాత వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాదాపు నాలుగేళ్లు వాళ్ల మధ్య గొడవలు జరిగాయి.

Sri Laxmi was the first wife who divorced Nagarjuna because she could not stand it

Sri Laxmi was the first wife who divorced Nagarjuna because she could not stand it

చివరకు 1990 లో శ్రీలక్ష్మీకి నాగార్జున విడాకులు ఇచ్చారు.ఆ తర్వాత తన సహ నటి అమలను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు అఖిల్ జన్మించాడు. అయితే.. అసలు నాగార్జున, శ్రీలక్ష్మీ ఇద్దరూ ఎందుకు విడిపోయారు అనేదానిపై చాలామందికి క్లారిటీ లేదు. నిజానికి శ్రీలక్ష్మీ.. రామానాయుడుకు ఏకైక కూతురు. వేల కోట్ల డబ్బు వారసత్వంగా వచ్చాయి. చిన్నప్పటి నుంచి తను చాలా గారాబంగా పెరిగింది. అందుకే ప్రతి విషయంలో తనదే పై చేయిగా ఉండాలని అనుకునేవారట.

నాగార్జునతో ఆ ఒక్క విష‌యంలో రాజీ ప‌డ‌లేకే మొద‌టి భార్య శ్రీల‌క్ష్మి విడాకులు ఇచ్చేసిందా...! - Telugu Lives

Nagarjuna – Sri Laxmi : నాగార్జున కూడా స్టార్ హీరో కావడంతో

మరోవైపు నాగార్జున కూడా ఏఎన్నార్ కొడుకు, ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతున్న వ్యక్తి. అప్పట్లో నాగార్జునకు లేడీ ఫ్యాన్స్ చాలామంది ఉండేవారు. నాగార్జున సినిమాల్లో నటించడం శ్రీలక్ష్మికి ఇష్టం ఉండేది కాదు. నాగార్జున మాత్రం ఎక్కడో అమెరికాలో చదివి అక్కడ ఉద్యోగం మానేసి మరీ సినిమాల్లో నటించేందుకు భారత్ కు తిరిగి వచ్చేశారు. కానీ.. శ్రీలక్ష్మి మాత్రం అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిల్ అవ్వాలని ఉండేది. అక్కడే ఏదైనా వ్యాపారం చేస్తూ ఉండాలనేది శ్రీలక్ష్మీ కోరిక. కానీ.. శ్రీలక్ష్మీ, నాగార్జున ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు వేర్వేరు. దీంతో ఎవ్వరూ కాంప్రమైజ్ కాలేదు. దీంతో చివరకు ఇద్దరూ పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి జీవితాలు వారివి అయ్యాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp