Sri reddy : ఒరేయ్ నత్తినాకొడకా అంటూ నానిపై శ్రీరెడ్డి ఫైర్..!
Sri reddy ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశం రోజురోజుకూ మరింత వివాదంగా మారిపోతోంది. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇటీవల హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. సినిమా థియేటర్ల కంటే కిరాణ కొట్టు వారికి వస్తున్న కలెక్షన్లు ఎక్కువ ఉంటాయన్నారు. ఈవ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు మండి పడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబుతో పాటు పలువురు నేతలు నాని కామెంట్స్ ను తప్పుబట్టారు. అయితే సినిమాలు మానేసి కిరాణా కొట్టే పెట్టుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా వైసీపీకి మద్దతుగా నిలుస్తూ ఉండే నటి శ్రీ రెడ్డి కూడా ఇప్పుడు నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
ఏపీలో టికెట్ల ధరల తగ్గింపు అంశంలో ఏపీ మంత్రులు వర్సెస్ హీరో నానిగా వివాదం మరింత ముదురుతోంది. నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. అతనిపై విరుచుకు పడింది. నాని.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడంటూ ఆరోపించింది. టిక్కెట్స్ రేట్స్ తగ్గిస్తే.. ప్రేక్షకులను అవమానపరిచినట్టు ఎలా అవుతుందనే ప్రశ్నించింది. సినిమా థియేటర్స్ విషయంలో నానికి నిజంగానే బాధ అనిపిస్తే మరి V, టక్ జగదీష్ సినిమాల ఓటీటీ విడుదల సమయంలో థియేటర్స్ యజమానులను ఎందుకు కించపరిచారో చెప్పలని నిలదీశారు. థియేటర్స్ యాజమాన్యంపై ఒకప్పుడు అలా మాట్లాడి..
Sri reddy నానిపై విరుచుకు పడ్డ శ్రీ రెడ్డి..
ఇప్పుడేమో వారిపై కపట ప్రేమ నటిస్తున్నారని మండి పడ్డారు. అర్థం పర్థం లేని మాటలతో ప్రజలను పిచ్చివారిని చేయడం మానుకోవాలని సూచించారు. అయితే నానిపై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వైసీపీ నేతలు, శ్రీ రెడ్డి చేసిన ఈ విమర్శలపై నాని స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జీవో 35ను సవాల్ చేస్తూ.. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది.