Sri Reddy : తీసేదేమో అట్ట‌ర్ ఫ్లాప్స్ అంటూ పూరీ జ‌గ‌న్నాథ్ పై మండిప‌డ్డ శ్రీ రెడ్డి..!

Authored By Sam C | The Telugu News | Published on: August 26, 2022, 12:40 pm

Sri Reddy : ఒక‌ప్పుడు మంచి చిత్రాలు తెర‌కెక్కించిన పూరీ జ‌గ‌న్నాథ్ ఇటీవ‌లి కాలంలో చాలా వీక్ అయ్యాడు. చాలా రోజుల త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఆ ఊపులోనే లైగ‌ర్ సినిమా చేశాడు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు హైప్ విపరీతంగా పెంచడం.. కథపై ఫోకస్ పెట్టకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురవుతున్నారు. లైగర్ చిత్రానికి వస్తున్న నెగిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు మరో మూవీపై ప్రభావం చూపుతోంది. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి మాట్లాడుతూ.. లైగర్ కన్నా డబుల్ బడ్జెట్ తో జనగణమన తెరకెక్కిస్తున్నాం అని ప్రకటించాడు. కానీ ఊహించని విధంగా లైగర్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Sri Reddy : శ్రీ రెడ్డి ఫైర్…

దీనితో ‘జనగణమన’ ఆగిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు అని నెటిజన్లు అంటున్నారు. ఇదే అదునుగా మహేష్ ఫ్యాన్స్ పూరి జగన్నాధ్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో శ్రీ రెడ్డి తనదైన పంథాలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై ఘాటు, హాటు కామెంట్స్ చేసింది. ‘లైగ‌ర్’ సినిమా ఫ‌లితంపై పూరి జ‌గ‌న్నాథ్‌ను టార్గెట్ చేస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. ‘‘తీసేది ఏమో అట్టర్ ఫ్లాప్ సినిమాలు, మరలా మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వటం లేదు, అని బాబు మీద పడి ఏడవటం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా. లైగర్‌కి ముందు లైగర్ తర్వాత అంట.. అనవసరమైన హైప్ లు అవసరమా, కంటెంట్ వున్నోడికి హైప్ అవసరం లేదు,

Sri Reddy Fire on Puri Jagannath Liger movie

Sri Reddy Fire on Puri Jagannath Liger movie

లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్, బెటర్ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం’’ అని శ్రీ రెడ్డి తెలియ‌జేసింది. జనగణమన చిత్రాన్ని భారీ బడ్జెట్ లో మహేష్ బాబుతో తెరకెక్కించాలని పూరి కొన్నేళ్ల క్రితం భావించాడు. అనౌన్స్ మెంట్ కూడా జరిగింది. కానీ ఆ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత పూరి ఓ ఇంటర్వ్యూలో.. మహేష్ బాబు తాను హిట్స్ లో ఉన్నప్పుడు మాత్రమే సినిమా చేస్తాడు అని బాహాటంగానే విమర్శించాడు. ప్రస్తుతం తాను ఫ్లాప్స్ లో ఉండడం వల్ల జనగణమన చేయడం లేదని పూరి విమర్శించారు. ఏదేమైన లైగర్ రిజల్ట్ ఇలా కావడంతో మహేష్ ఫాన్స్ గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. కానీ కామన్ ఆడియన్స్ మాత్రం పూరి జగన్నాధ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp