Sri Reddy : శ్రీరామచంద్ర బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. మనోడు ఇంత రసికుడా..!
Sri Reddy : శ్రీరామచంద్ర.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఐడల్ విన్నర్‌గా కాకుండా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కూడా ఎందరో మనసులు గెలుచుకున్నాడు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు హమీదాతో పులి హోర కలిపిన శ్రీరామచంద్ర గతంలో శ్రీ రెడ్డితో కలిపాడు. అందుకు సాక్ష్యంగా శ్రీ రెడ్డి దఫాలుగా ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేస్తుంది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలో శ్రీరెడ్డి.. టాలీవుడ్ రసికరాజులు బాగోతాలను బయటపెడుతూ.. తనతో ఆ పని కోసం చాట్ చేసిన వాళ్ల లిస్ట్ మొత్తం బయటపెట్టింది.. ఆ లిస్ట్‌లో దగ్గుబాటి వారసుడు అభిరామ్ మొదలు.. వైవా హర్ష, శ్రీరామ్, లారెన్స్ ఇలా చాలామంది పేర్లు బయటపెట్టింది శ్రీరెడ్డి.
స్టార్ సింగర్ గా పేరున్న శ్రీరామ చంద్ర ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన మొదటి తెలుగు సింగర్. బయట శ్రీరామ చంద్రకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అతను బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న సమయంలో శ్రీ రెడ్డి.. శ్రీరామ చంద్రకు ఓటేయకండి.. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే సమాజానికి ఆదర్శంగా ఉంటుంది. శ్రీరామ చంద్ర లాంటివారు గెలవడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి బిగ్‌బాస్ టైటిల్ కూడా ఇచ్చేయాలనడం సమంజసం కాదు. నటించేవాళ్లను, ఫేక్ గాళ్ళను అసలు నమ్మొద్దని, అన్నారు.కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీ రెడ్డి.. గతంలో శ్రీరామ్ తనతో సన్నిహితంగా ఉన్నాడంటూనే.. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

sri reddy reveals the secrets of sri ram chandra
Sri Reddy : రహస్యం బట్టబయలు…
తనతో శ్రీరామ్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తీసి ఇమేజ్‌ను కూడా పోస్ట్ చేసింది. అయితే ఆ మెసేజ్‌లో శ్రీరెడ్డి.. శ్రీరామ్‌ను రెచ్చగొట్టినట్టు ఉండడంతో తప్పు శ్రీ రెడ్డిది కూడా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు శ్రీరామ చంద్ర తన ఫేమ్ తో అమ్మాయిలను వశపరుచుకోవడానికి చూస్తాడని శ్రీరెడ్డి ఆరోపిస్తున్నారు. కాగా, శ్రీరామ చంద్ర తనతో వాట్సాప్ లో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మన ఇండియన్ ఐడిల్ చాట్ చూడండి.. శ్రీరామ్ సిగ్గుపడాలి..ముందు నీ పేరులోనుంచి శ్రీరామ్ ను తొలగించు. ఆ పేరుతో పిలిపించుకునేందుకు నువ్వు అర్హుడివి కాదు’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.’’ ఇది పోస్టు చేసి నాలుగు సంవత్సరాలు (2017) అవుతోంది.