Sri Reddy : చీరకట్టడం ఎలానో నేర్పించిన శ్రీ రెడ్డి.. మొత్తం చూపిస్తూ నానా రచ్చ..!
Sri Reddy: కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో అందరి దృష్టిని ఆకర్షించిన కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీరెడ్డి. ఈ అమ్మడు ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్‌పై విరుచుకు పడుతూ దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెను టాలీవుడ్ నుండి పంపించేశారు. దీంతో చెన్నైలో సెటిల్ అయిన శ్రీ రెడ్డి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ దాని ద్వారా తన అభిమానులకి వినోదం పంచుతుంది. శ్రీ రెడ్డి నందు హీరోగా నటించిన నేను నాన్న అబద్ధం చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. ఆమెకు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
తన యూట్యూబ్ ఛానల్ లో శ్రీ రెడ్డి చేసే హంగామా మాములుగా లేదు. ఆమె ఇలా వీడియో పోస్ట్ చేసిందో లేదో కొద్ది నిమిషాలలోనే వైరల్ అవుతుంటుంది. తాజాగా శ్రీ రెడ్డి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో శ్రీరెడ్డి సంప్రదాయబద్ధంగా చీరను కట్టి కనిపించింది. అయితే ఆ వీడియోలో ఆమె చీరను ఎలా కట్టాలి అన్నది చూపిస్తూ కనిపించింది. అమ్మాయిలకు చీర కట్టడం చాలా అవసరం అమ్మాయిలకు ముందుగా నేర్చుకోవాల్సింది ఇదే అంటూ తన అందాలను చూపిస్తూ ఎంతో సంప్రదాయంగా ఆ చీరను కట్టి అందంగా, అభినయంగా కనిపించింది శ్రీరెడ్డి.
Sri Reddy ; శ్రీరెడ్డి రచ్చ..
కంచి పట్టు చీరను ఎలా కట్టాలో చూపిస్తూ ఎంతో అందంగా కట్టి అందరూ నేర్చుకునేలా దాన్ని వివరించి అందరికీ చూపిస్తూ చీరను కట్టింది. శ్రీ రెడ్డి చీరకట్టు వ్యవహారం చూసి అందరు నోరెళ్లపెడతున్నారు. ఈ అమ్మడు యూట్యూబ్‌లో ఏం పెట్టిన జనాలు తెగ ఎగబడి చూస్తున్నారు. మొత్తానికి తన పాపులారిటీ క్యాష్ చేసుకున్న శ్రీరెడ్డి సోషల్ మీడియాలోను దూసుకుపోతుంది. రెండు చేతులా సంపాదిస్తున్న శ్రీ రెడ్డి త్వరలో నిర్మాతగా కూడా అవతారం ఎత్తనుందని కొందరు జోస్యాలు చెబుతున్నారు.