Bigg Boss 6 Telugu : శ్రీ సత్య చేసిన అతిపెద్ద చెత్త పనికి… టీవీ చూసే ప్రతి ఒక్కరు తెగ తిడుతున్నారు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 6 Telugu : శ్రీ సత్య చేసిన అతిపెద్ద చెత్త పనికి… టీవీ చూసే ప్రతి ఒక్కరు తెగ తిడుతున్నారు!

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి ఆరో సీజన్ వరకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఏడవ వారం పూర్తి చేసుకోనుంది. వీకెండ్ రావడంతో హోస్ట్ నాగార్జున రంగంలోకి వచ్చాడు. ఈవారం హౌస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో ఇంటి సభ్యుల పట్ల రియాక్షన్ ఎలా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 October 2022,10:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి ఆరో సీజన్ వరకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఏడవ వారం పూర్తి చేసుకోనుంది. వీకెండ్ రావడంతో హోస్ట్ నాగార్జున రంగంలోకి వచ్చాడు. ఈవారం హౌస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో ఇంటి సభ్యుల పట్ల రియాక్షన్ ఎలా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠిన పరీక్షలు పెట్టాడు. పొట్ట మార్చాడు. అలాగే సర్వైవల్ టాస్క్ పేరుతో ఇంటి సభ్యుల మధ్య మంట పెట్టాడు. ఇలా వీక్ మొత్తం కొంచెం సీరియస్గా సాగింది. ఇంటి సభ్యుల రెండు టీమ్స్ గా చేసి బిగ్ బాస్ సర్వైవల్ టాస్క్ ఆడించారు.

చిన్న రంధ్రం నుంచి పూలు, బొమ్మలు వస్తూ ఉంటాయి. సభ్యులు వాటిని సేకరించాలి. ఎక్కువ ఎవరు సేకరిస్తే ఆ టీం గెలుస్తుంది. ఈ గేమ్ లో శ్రీ సత్య టీం ఓడిపోయింది. ఓడిపోయిన టీం సభ్యుల నుండి ఒకరు నేరుగా నామినేట్ అవుతారు. అది ఎవరనేది ఆ టీం సభ్యులు డిసైడ్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పారు. అందరు బాగా ఆడారు ఒకరిని కారణం చేయడం ఎందుకని చెప్పిన శ్రీ సత్య చిట్టీలు రాసి ఎవరు పేరు వస్తే వాళ్ళు నామినేట్ అయినట్లు చెప్పూ. చిట్టీ లలో టీం సభ్యుల పేర్లు రాసి జాడీలో వేశారు. మరో టీం కు చెందిన ఫైమాని పిలిచి చిట్టి తీయమనగా ఫైమా తీసిన చిట్టిలో శ్రీ సత్య పేరు వచ్చింది. అయితే శ్రీ సత్య చిట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ నామినేషన్ వేయించింది.

Sri Satya about on Bigg Boss 6 Telugu Contestant

Sri Satya about on Bigg Boss 6 Telugu Contestant

ఎవరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పమంది. అప్పుడు ఎక్కువ ఓట్లు వాసంతికి వచ్చాయి. దాంతో ఆమె నామినేట్ అయింది. ఈ విషయాన్ని నాగార్జున అడగగా చిట్టిలో వేసినప్పుడు శ్రీ సత్య పేరు వచ్చింది దాన్ని రద్దు చేసి మళ్ళీ నామినేషన్ పెట్టడం కరెక్ట్ గా ఫీల్ అయ్యారా అని అడిగాడు. దానికి శ్రీ సత్య ఇలా క్లారిటీ ఇచ్చింది. ఈవారం మీరు బాగా తిడతారని అనుకున్నాను చిట్టీలతో నామినేషన్ డిసైడ్ చేస్తే ఏమంటారో అని మార్చాను సార్ అని చెప్పింది. దానికి నాగార్జున అయితే నేరం నా మీదకు నెట్టేశారా అని ఆశ్చర్యపోయారు. ఇక ఈ వారం మొత్తం 13 మంది ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతారనే ఉత్కంఠ కొనసాగుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది