Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఇప్పటి ఆరో సీజన్ వరకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఏడవ వారం పూర్తి చేసుకోనుంది. వీకెండ్ రావడంతో హోస్ట్ నాగార్జున రంగంలోకి వచ్చాడు. ఈవారం హౌస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో ఇంటి సభ్యుల పట్ల రియాక్షన్ ఎలా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠిన పరీక్షలు పెట్టాడు. పొట్ట మార్చాడు. అలాగే సర్వైవల్ టాస్క్ పేరుతో ఇంటి సభ్యుల మధ్య మంట పెట్టాడు. ఇలా వీక్ మొత్తం కొంచెం సీరియస్గా సాగింది. ఇంటి సభ్యుల రెండు టీమ్స్ గా చేసి బిగ్ బాస్ సర్వైవల్ టాస్క్ ఆడించారు.
చిన్న రంధ్రం నుంచి పూలు, బొమ్మలు వస్తూ ఉంటాయి. సభ్యులు వాటిని సేకరించాలి. ఎక్కువ ఎవరు సేకరిస్తే ఆ టీం గెలుస్తుంది. ఈ గేమ్ లో శ్రీ సత్య టీం ఓడిపోయింది. ఓడిపోయిన టీం సభ్యుల నుండి ఒకరు నేరుగా నామినేట్ అవుతారు. అది ఎవరనేది ఆ టీం సభ్యులు డిసైడ్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పారు. అందరు బాగా ఆడారు ఒకరిని కారణం చేయడం ఎందుకని చెప్పిన శ్రీ సత్య చిట్టీలు రాసి ఎవరు పేరు వస్తే వాళ్ళు నామినేట్ అయినట్లు చెప్పూ. చిట్టీ లలో టీం సభ్యుల పేర్లు రాసి జాడీలో వేశారు. మరో టీం కు చెందిన ఫైమాని పిలిచి చిట్టి తీయమనగా ఫైమా తీసిన చిట్టిలో శ్రీ సత్య పేరు వచ్చింది. అయితే శ్రీ సత్య చిట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ నామినేషన్ వేయించింది.
ఎవరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పమంది. అప్పుడు ఎక్కువ ఓట్లు వాసంతికి వచ్చాయి. దాంతో ఆమె నామినేట్ అయింది. ఈ విషయాన్ని నాగార్జున అడగగా చిట్టిలో వేసినప్పుడు శ్రీ సత్య పేరు వచ్చింది దాన్ని రద్దు చేసి మళ్ళీ నామినేషన్ పెట్టడం కరెక్ట్ గా ఫీల్ అయ్యారా అని అడిగాడు. దానికి శ్రీ సత్య ఇలా క్లారిటీ ఇచ్చింది. ఈవారం మీరు బాగా తిడతారని అనుకున్నాను చిట్టీలతో నామినేషన్ డిసైడ్ చేస్తే ఏమంటారో అని మార్చాను సార్ అని చెప్పింది. దానికి నాగార్జున అయితే నేరం నా మీదకు నెట్టేశారా అని ఆశ్చర్యపోయారు. ఇక ఈ వారం మొత్తం 13 మంది ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతారనే ఉత్కంఠ కొనసాగుతుంది.
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం మరి కొద్ది రోజులలో…
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
This website uses cookies.