Zodiac Signs : అక్టోబర్ 23 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

Advertisement
Advertisement

Zodiac Signs : మేష రాశి :  ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు చాలా అవకాశాలు వస్తాయి. అవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి తగిన గుర్తింపు ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వారితో మీ విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది. వృషభ రాశి : ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తవ్వాలంటే మీరు చాలా తెలివిని ప్రదర్శించాల్సి ఉంటుంది. అది కూడా ప్రాక్టికల్ అప్రోచ్ అయి ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. సహనం చాలా అవసరం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు చేపట్టిన వర్క్ అనుకున్న సమయానికే పూర్తవుతుంది. మీ తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.

Advertisement

మిథున రాశి : మీ బుద్ధి బలాన్ని ఉపయోగిస్తారు. అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. చాలా నమ్మకంతో ఉండండి. విజయం మిమ్మల్ని పలకరిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు వర్క్ ను ప్లాన్ చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది. కర్కాటక రాశి : ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలమైన దినం. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.

Advertisement

Today Horoscope October 23 2022 Check Your Zodiac Signs

సింహ రాశి : మీకు సహనం చాలా అవసరం. చాలా తెలివితో నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు మీ ఫోకస్ ను మరిచిపోకండి. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. పంటినొప్పి బాధిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

కన్య రాశి : మీరు అనుకున్న పనులేవీ నెరవేరవు. అడ్డంకులు వస్తాయి. అయినా కూడా మీరు ధైర్యంతో ముందుకెళ్లండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మాత్రం అనుకూలంగా ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి.

తుల రాశి : సరైన ప్లాన్స్ వేసుకోవాలి. లేకపోతే ఏ పనీ పూర్తి కాదు. చారిటీలకు దానం చేస్తే కాస్త రిలీఫ్ పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఫోకస్ గా ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. దృష్టిని మరల్చే విషయాలపై ఫోకస్ పెట్టకండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీ జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. సరైన ప్రణాళిక ఉండదు. ఆర్థిక ప్రణాళికను వేసుకోండి. మీకు మోకాళ్ల నొప్పులు బాధిస్తాయి. ఎక్కువగా స్ట్రెస్ కు గురి కాగండి. ప్రతి రోజు వ్యాయామం చేయండి. మిమ్మల్ని మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉంచుకోండి.

వృశ్చిక రాశి : ఈరోజు మీ అదృష్టమైన రోజు. మీరు ఏ పని మొదలు పెడితే ఆ పని పూర్తవుతుంది. అన్ని కష్టాలు తీరిపోతాయి. ఎలాంటి అడ్డంకులు వచ్చినా అన్నీ తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు మీ టాస్క్ ను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇద్దరూ సరదాగా గడుపుతారు. మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు బాధించవు.

ధనస్సు రాశి : ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మకర రాశి : నెగెటివ్ ఆలోచనలను మానుకోండి. దాని కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. యోగా చేయండి. మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు మీ వర్క్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోండి. లేకపోతే పని ఒత్తిడి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బును సరిగ్గా మేనేజ్ చేసుకోండి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి.

కుంభ రాశి : మీరు చాలా పాజిటివ్ గా ఉండాలి. ఎలాంటి చాలెంజ్ లు వచ్చినా తట్టుకునేలా ఉండాలి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారు తోటి ఉద్యోగులతో కాస్త ప్రొఫెషనల్ గా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో ఓర్పుతో ఉండండి. లేకపోతే మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం సహకరించదు.

మీన రాశి : ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు చాలా క్లారిటీతో ఉంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సరికొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అవసరాల కోసం కొంత డబ్బును లోన్ గా తీసుకుంటారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా ఫిట్ గా ఉంటారు.

Recent Posts

Virat Kohli – Gautam Gambhir: గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌కు ఎలాంటి విభేదాలు లేవు .. బ్యాటింగ్ కోచ్ కామెంట్స్ వైర‌ల్

Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…

1 hour ago

Bhartha mahasayulaku vignapthi | బాక్స్ ఆఫీస్ వద్ద ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓపెనింగ్స్ .. అంచనాలకు తగ్గలేదు

Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…

2 hours ago

iPhone 15 : ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్న ధర ఎక్కువని కొనలేకపోతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్

iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…

3 hours ago

Pawan Kalyan : రాజకీయ నాయకుల కోసం ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ పవన్ హీరోయిన్ ఆగ్రహం

Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…

4 hours ago

Nara Lokesh : యాక్షన్ కు సిద్దమైన నారా లోకేష్.. వణికిపోతున్న సొంత పార్టీ నేతలు

Nara Lokesh  : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…

5 hours ago

Eating : భోజనం చేయగానే ఆ పని అస్సలు చేయకూడదు..!

Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…

6 hours ago

Udyogini Scheme : మహిళల కోసం ‘ఉద్యోగిని పథకం 2026’ ను తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం, దీనికి ఎలా అప్లయ్ చేయాలంటే !!

Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…

7 hours ago

NIT Warangal Recruitment 2026: నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త..NIT లో పెద్ద ఎత్తున జాబ్స్ మీరు అప్లై చేసుకోవడమే ఆలస్యం !1

NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…

8 hours ago