Sri Satya : అతనిపై మనసు పారేసుకున్న శ్రీ సత్య.. ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానంటూ కామెంట్
Sri Satya : చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అదిరిపోయే నటన, డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరి మనసులని కొల్లగొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య. గత ఏడాది బిగ్ బాస్ షోలో పాల్గొని తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. దీంతో మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. అలాగే, శ్రీ సత్య సోషల్ మీడియాలోనూ యమ సందడి చేసేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ సత్య మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. తర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఆంధ్రాగా గెలిచి సత్తా చాటింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అప్పుడే ఏకంగా ‘నేను శైలజ’ సినిమాలో రామ్ పోతినేని లవర్‌గా నటించింది. ఆ తర్వాత ‘గోదావరి నవ్వింది’, ‘లవ్ స్కెచ్’ చిత్రాలను చేసింది.
Sri Satya : అతనిపై మనసు పారేసుకున్న శ్రీ సత్య.. ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానంటూ కామెంట్
డిఫరెంట్ యాటిట్యూడ్‌తో లేడీ మోనార్క్ అనిపించిన శ్రీ సత్య.. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ఒక మాట అన్నది. ఇది తన యాటిట్యూడ్ కాదని.. తన జీవితంలో జరిగిన ఘటనలతో మనుషులను నమ్మడం, మాట్లాడటం మానేశానంటూ అందుకే ఇలా ఉంటున్నాను అంటూ కామెంట్స్ చేసింది. ప్రేమించి పెళ్లి వరకూ వెళ్లి.. నిశ్చితార్ధం చేసుకున్న తరువాత పెళ్లి చెడిపోవడం.. ఆ ప్రేమించినోడే తనని మోసం చేయడంతో పెళ్లి పీటలు ఎక్కకుండానే పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది శ్రీ సత్య. టీనేజ్ నుంచే పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది శ్రీ సత్య.. కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న తరువాత పెళ్లికి రెడీ అయ్యి నిశ్చితార్ధం చేసుకున్నారు. అయితే పవన్ రెడ్డి తనని మోసం చేశాడంటూ ఆ టైంలో ఆత్మహత్యాయత్నం చేసినట్టు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుని ఏడ్చింది శ్రీ సత్య.
ఈ మధ్య శ్రీ సత్య.. మొహబూబ్‌తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేస్తుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. రీసెంట్ గా కూడా ఓ వీడియో చేసింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో సత్య మాట్లాడుతూ.. “రామ్ పోతినేని కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను. ఆయన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను. మళ్లీ ఆయనతో కలిసి నటించే అదృష్టం కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకు రాగా, ఆమెకి రామ్ అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. అని కొందరు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.