
Janhvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది కానీ ఇప్పటివరకు హిందీలో కమర్షియల్ హిట్ ఒక్కటి కూడా పడలేదు. అయినా కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ కథలతోనే సినిమాలు చేసిన అవి పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ తెలుగులో జాన్వీ కపూర్ కి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. స్టార్ హీరోయిన్ రేంజ్ రెమ్యూనరేషన్ ని ఇచ్చి జాన్వీని ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశారు.
అయితే తాజాగా యూవీ క్రియేషన్స్ లో అఖిల్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ని సెలెక్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రయాణ ఖర్చులు, ఖరీదైన హోటల్ ఆమె డిమాండ్ చేస్తుంది అని రూమర్స్ వస్తున్నాయి. అయితే అఖిల్ సినిమా కోసం రామ్ చరణ్ సినిమా కోసం జాన్వీ కపూర్ ని ఎవరు సంప్రదించనేలేదట. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్ని ప్రచారాలు అని తెలుస్తుంది.
అయితే జాన్వి కపూర్ ను టాలీవుడ్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దానికి కారణం కేవలం శ్రీదేవి కూతురు అనే బ్రాండ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జాన్వీ కపూర్ పట్ల ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఈ రూమర్స్ అని కూడా ప్రచారంలోకి వస్తున్నాయని తెలుస్తుంది. అయితే జాన్వి కపూర్ దృష్టి అంతా ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమా పైనే మాత్రమే ఉందని టాక్. ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో కావడంతో అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆమె ఎక్కువ ఇష్టపడుతుందని సినీ ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. మరీ శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
This website uses cookies.