Sreemukhi : అనసూయ వెళ్లిపోవడంతో శ్రీముఖిని సంప్రదిస్తే ఏమన్నదో తెలుసా?
Sreemukhi : జబర్దస్త్ యాంకర్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన అనసూయ ఇటీవలే షో కి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. ఆమె షో కి గుడ్ బై చెప్పిన సమయంలో యాంకర్ గా ఎవరు వస్తారు అంటూ చాలా రకాల ప్రచారం జరిగింది. మంజుష, శ్రీముఖి ( Sreemukhi ) ఇంకా కొందరి పేర్లు ప్రచారం జరిగాయి. కానీ చివరికి రష్మీ నే జబర్దస్త్ యాంకర్ గా మారింది. జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ కి కూడా ఆమె యాంకరింగ్ చేస్తోంది. జబర్దస్త్ ప్రారంభం అయిన సమయంలో శ్రీముఖిని యాంకర్ గా అనుకున్నారు, ఆమెను సంప్రదించారు. కానీ కొన్ని కారణాలు చెప్పి ఆమె షో ని అప్పుడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పలు సందర్భాల్లో జబర్దస్త్ కార్యక్రమాన్ని తాను కాదనుకున్నందుకు చాలా బాధపడ్డాను అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.
అప్పట్లో తప్పి పోయిన అవకాశం ఇప్పుడు అనసూయ వెళ్లి పోవడంతో శ్రీముఖి తలుపు తట్టింది. అయినా ఈసారి కూడా ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి శ్రీముఖి నో చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం బుల్లి తెర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మల్లెమాల కాంపౌండ్ నుండి వినిపిస్తున్న ప్రచారం మేరకు అనసూయ వెళ్ళిన వెంటనే శ్రీముఖి ని జబర్దస్త్ యాంకర్ గా తీసుకు వచ్చేందుకు మల్లెమాల వారు ప్రయత్నించారు. కానీ ఆమె నో చెప్పిందట, సున్నితంగా మల్లెమాల (mallemala) వారి యొక్క ఆఫర్ ని తిరస్కరించింది. గతంలో చేయాలనుకున్న ఆమె ఇప్పుడు ఎందుకు నో చెప్పింది అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Sreemukhi again says no to jabardasth offer for anchoring
అసలు విషయం ఏంటంటే జబర్దస్త్ (jabardasth ) అనగానే అనసూయ, రష్మీ మాత్రమే గుర్తుకొస్తారు. కనుక ఇప్పుడు తాను ఎంట్రీ ఇచ్చి ఏదో సాధించాలని ప్రయత్నిస్తే విమర్శలే ఎదురు అవుతాయి కానీ ప్రశంసలు దక్కడం అనేది అసాధ్యం. అందుకే జబర్దస్త్ లో మధ్యలో ఎంట్రీ ఇచ్చి అభాసుపాలు అవ్వడం తనకు ఇష్టం లేదు అంటూ వింతగా శ్రీముఖి సమాధానం చెప్పిందట. ఈ విషయం కాస్త కన్విన్స్ గా ఉన్న ఆమె నిర్ణయాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. వచ్చిన గొప్ప అవకాశాన్ని.. జబర్దస్త్ ఆఫర్ ని ఎవరైనా కాదంటారా అంటూ ఆమెను తిట్టి పోస్తున్నారు. గతంలో మిస్ చేసుకున్న ఆఫర్ మళ్ళీ వచ్చినప్పుడు ఎవరైనా ఎగిరి గంతేసి ఓకే చెప్తారు, కానీ ఆమె నెగటివ్ గా ఆలోచించి పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకోలేక పోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. శ్రీముఖి జబర్దస్త్ యాంకర్ గా చేసేందుకు నో చెప్పడం ను మీరు వ్యతిరేకిస్తారా? సమర్థిస్తారా?