Shruti Hassan gives clarity about her health
Shruti Hassan : గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు కెరీర్ విషయంలో కాస్త సైలెంట్ అయిన శృతి స్పీడ్ పెంచింది. ఆమె ఏకంగా టాలీవుడ్ బడా స్టార్స్ తో నటిస్తూ మతిపోగొడుతోంది. ఊహించని విధంగా తను సినిమాలను లైనప్ చేస్తోంది. గత వైభవాన్ని తీసుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చివరిగా మాస్ మహారాజా రవితేజ సరసన‘క్రాక్’ సినిమాలో నటించింది. అందాలు ఆరబోయడమే కాకుండా మాస్ మాహారాజ సరసన మాస్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. మరో వైపు ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
శృతి చేసిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడంతో, ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ స్థాయిని కూడా అందుకుంది. అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడు తిరిగి సినిమాల్లో యమబిజీగా మారింది. సోషల్ మీడియాలో రీసెంట్‌గా ఇటీవల పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఆమెకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తన వర్కవుట్ వీడియోను షేర్ చేసి తనకున్న హార్మోనల్ ఇష్యూస్ గురించి చెప్పుకొస్తూ.. తాను మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా, ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపింది. తనకు పీసీఓస్(రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడం లేదా ఎక్కువ రోజులు పీరియడ్స్ అవుతూ ఉండడం) ఉందని..
Shruti Hassan gives clarity about her health
ఇది చాలా మంది ఆడవారిలో వచ్చే సమస్య అంటూ శ్రుతి చెప్పుకొచ్చింది. హార్మోన్ బ్యాలెన్స్ తప్పడంతో పీసీఓస్‌తో బాధపడుతుంటారని ఆమె చెప్పుకొచ్చింది.దీంతో శృతి హాసన్ ఆరోగ్యంపై అనేక పుకార్లు హల్‌చల్ చేశాయి. శ్రుతి ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండటంతో, తాజాగా ఈ అంశంపై శ్రుతి స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను చాలా బాగున్నానని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని శ్రుతి ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇదొక కామన్ ఇష్యూ అని.. దీన్ని మీడియాలో నెగెటివ్‌గా ప్రెజెంట్ చేశారని ఆమె క్లారిటీ ఇచ్చింది.
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
This website uses cookies.