Shruti Hassan : శృతి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందా.. క్లారిటీ ఇచ్చిన క‌మ‌ల్ కూతురు

Authored By Sam C | The Telugu News | Published on: July 6, 2022, 1:30 pm

Shruti Hassan : గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు కెరీర్ విష‌యంలో కాస్త సైలెంట్ అయిన శృతి స్పీడ్ పెంచింది. ఆమె ఏకంగా టాలీవుడ్ బడా స్టార్స్ తో నటిస్తూ మతిపోగొడుతోంది. ఊహించని విధంగా తను సినిమాలను లైనప్ చేస్తోంది. గత వైభవాన్ని తీసుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చివరిగా మాస్ మహారాజా రవితేజ సరసన‘క్రాక్’ సినిమాలో నటించింది. అందాలు ఆరబోయడమే కాకుండా మాస్ మాహారాజ సరసన మాస్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. మరో వైపు ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

శృతి చేసిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడంతో, ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ స్థాయిని కూడా అందుకుంది. అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ, ఇప్పుడు తిరిగి సినిమాల్లో యమబిజీగా మారింది. సోష‌ల్ మీడియాలో రీసెంట్‌గా ఇటీవల పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఆమెకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తన వర్కవుట్ వీడియోను షేర్ చేసి తనకున్న హార్మోనల్ ఇష్యూస్ గురించి చెప్పుకొస్తూ.. తాను మానసికంగా ఎంతో ధృడంగా ఉన్నా, ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపింది. తనకు పీసీఓస్‌(రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడం లేదా ఎక్కువ రోజులు పీరియడ్స్ అవుతూ ఉండడం) ఉందని..

Shruti Hassan gives clarity about her health

Shruti Hassan gives clarity about her health

Shruti Hassan : నిజం ఇది..

ఇది చాలా మంది ఆడవారిలో వచ్చే సమస్య అంటూ శ్రుతి చెప్పుకొచ్చింది. హార్మోన్ బ్యాలెన్స్ తప్పడంతో పీసీఓస్‌తో బాధపడుతుంటారని ఆమె చెప్పుకొచ్చింది.దీంతో శృతి హాస‌న్ ఆరోగ్యంపై అనేక పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. శ్రుతి ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండటంతో, తాజాగా ఈ అంశంపై శ్రుతి స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను చాలా బాగున్నానని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని శ్రుతి ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇదొక కామన్ ఇష్యూ అని.. దీన్ని మీడియాలో నెగెటివ్‌గా ప్రెజెంట్ చేశారని ఆమె క్లారిటీ ఇచ్చింది.

Sam C

No bio available for this author.

  1. "AP Sarpanch Elections : సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. గ్రామానికి రూ.1.50 కోట్లు ఇస్తా..!"

  2. "Hyderabad Bomb Threat : బ్రేకింగ్ న్యూస్‌.. హైదరాబాద్‌కు ఉగ్రదాడి బెదిరింపు మెయిల్.. పోలీసుల హై అలర్ట్!"

  3. "Today Horoscope : 23 నవంబర్ 2026 సోమ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు.. ఈ రాశులకు ధనలాభం..!"

  4. "Samsung Galaxy S25 Ultra : అబ్బా ఏం ఆఫర్.. రూ.1.30 లక్షల ఫోన్ రూ.50 వేలకే?.. ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..!"

  5. "Gold Price Crash : బంగారం ధరలు భారీగా తగ్గినా కొనడానికి వెనుకడుగు.. అసలు 5 కారణాలు ఇవే!"

  6. "8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు డబుల్ గుడ్‌న్యూస్ ? రూ.18 వేల జీతం రూ.65 వేలకు వ‌ర‌కు పెరిగే చాన్స్‌?"

  7. "Peerzadiguda Pulse Polio : పీర్జాదిగూడలో పోలియో చుక్కలు .. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలి: తవిటి ప్రశాంత్ కుమార్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp