Mahesh Babu : బాహుబలి తర్వాత రాజమౌళి తగ్గేదే లే అంటున్నాడు. అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. చివరిగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లను అందుకునే అవకాశం ఉందనే చెప్పాలి. ఇక మొత్తానికి సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఈ సినిమా కోసం పని చేసిన అందరూ ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అయితే రాజమౌళి మాత్రం తర్వాతి సినిమాకి సంబంధించి ప్రణాళికలు రచిస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోతోన్న సినిమా మీద రాజమౌళి తన దృష్టి పెట్టేశాడు. అయితే ఇంత వరకు ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు మాత్రం వచ్చాయి. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కొన్ని విషయాలు చెప్పాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ కథ రాస్తున్నాను అంటూ ఆ మధ్య హింట్ ఇచ్చాడు. ఇక రాజమౌళి తాజాగా మాట్లాడుతూ.. దాన్ని దాదాపు కన్ఫామ్ చేేసేశాడు. యాక్షన్ అడ్వంచర్ జానర్‌లో ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. అంతే కాకుండా రెండు కథలు కూడా అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. అంటే ఈ రెండు కథల్లో ఏదో ఒకటి మహేష్ బాబు సెలెక్ట్ చేసుకుంటాడన్న మాట.
మొత్తానికి ఈ ఏడాదిలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోందని తెలుస్తోంది.కానీ కరోనా వల్ల ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందు కొంత గ్యాప్ వచ్చింది. జనవరి 7న సినిమాను విడుదల చేయాలనుకుంటే… కరోనా కారణంగా మార్చి 25కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో మా నాన్న ఫోన్ చేసి ‘టైమ్ వేస్ట్ చేయకు. కథ మీద కూర్చుందాం’ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కొన్ని లైన్స్ డిస్కస్ చేసుకున్నామని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయేది యాక్షన్ అడ్వెంచర్ అని దానికి రెండు కథలు నా మైండ్ లో ఉన్నాయని అన్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆ సినిమా స్టోరీ మీద మళ్ళీ కూర్చుంటామని రాజమౌళి చెప్పుకొచ్చారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.