Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం రెండు క‌థ‌లు..విష‌యం లీక్ కావ‌డంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : మహేష్ బాబు సినిమా కోసం రెండు క‌థ‌లు..విష‌యం లీక్ కావ‌డంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :10 April 2022,6:30 pm

Mahesh Babu : బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తగ్గేదే లే అంటున్నాడు. అన్ని భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తూ అల‌రిస్తున్నాడు. చివ‌రిగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెర‌కెక్కించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లను అందుకునే అవకాశం ఉందనే చెప్పాలి. ఇక మొత్తానికి సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఈ సినిమా కోసం పని చేసిన అందరూ ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అయితే రాజ‌మౌళి మాత్రం త‌ర్వాతి సినిమాకి సంబంధించి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూనే ఉన్నాడు.

ప్ర‌స్తుతం మహేష్ బాబుతో చేయబోతోన్న సినిమా మీద రాజమౌళి తన దృష్టి పెట్టేశాడు. అయితే ఇంత వరకు ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు మాత్రం వచ్చాయి. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కొన్ని విషయాలు చెప్పాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ కథ రాస్తున్నాను అంటూ ఆ మధ్య హింట్ ఇచ్చాడు. ఇక రాజమౌళి తాజాగా మాట్లాడుతూ.. దాన్ని దాదాపు కన్ఫామ్ చేేసేశాడు. యాక్షన్ అడ్వంచర్ జానర్‌లో ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. అంతే కాకుండా రెండు కథలు కూడా అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. అంటే ఈ రెండు కథల్లో ఏదో ఒకటి మహేష్ బాబు సెలెక్ట్ చేసుకుంటాడన్న మాట.

SS rajamouli plans two stories for Mahesh Babu

SS rajamouli plans two stories for Mahesh Babu

Mahesh Babu : స్కెచ్ బాగానే వేస్తున్నాడు..

మొత్తానికి ఈ ఏడాదిలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోందని తెలుస్తోంది.కానీ కరోనా వల్ల ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందు కొంత గ్యాప్ వచ్చింది. జనవరి 7న సినిమాను విడుదల చేయాలనుకుంటే… కరోనా కారణంగా మార్చి 25కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో మా నాన్న ఫోన్ చేసి ‘టైమ్ వేస్ట్ చేయకు. కథ మీద కూర్చుందాం’ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కొన్ని లైన్స్ డిస్కస్ చేసుకున్నామని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయేది యాక్షన్ అడ్వెంచర్ అని దానికి రెండు కథలు నా మైండ్ లో ఉన్నాయని అన్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆ సినిమా స్టోరీ మీద మళ్ళీ కూర్చుంటామని రాజమౌళి చెప్పుకొచ్చారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది