SS Rajamouli : బాహుబ‌లి 3పై స్పందించిన రాజ‌మౌళి.. అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేవుగా..!

Advertisement

SS Rajamouli : ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి. ఈ సినిమా సృష్టించిన సెన్సేష‌న్స్ అన్నీ ఇన్ని కావు.రెండు పార్ట్‌లుగా ఈ చిత్రం విడుద‌ల కాగా, మూడో పార్ట్‌పై అంద‌రిలో అనుమానాలు నెల‌కొన్నాయి. అయితే బాహుబ‌లి సినిమాతో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తో పాటు ఇతర నటీనటులందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. ఇటీవల “రాధేశ్యామ్” సినిమా ప్రమోషన్ల సమయంలో బాహుబ‌లి 3 విషయంపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.మా కాంబోలో మరో ప్రాజెక్ట్ రూపొందనుందని, అది ఎప్పుడు అన్న విషయం మాత్రం తనకు తెలియదని ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశారు.

ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో ఎన్నెన్నో రికార్డులు సృష్టించాడు రాజమౌళి. కాగా, ‘బాహుబలి’కి కొనసాగింపుగా ‘బాహుబలి-3’ రానుందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారమవుతోన్న వార్తలపై రాజమౌళి స్పందిస్తూ.. “బాహుబలి 3 చేయడానికి ప్రభాస్, నేను, నిర్మాతలు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాము. ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి, అయితే దాని గురించి నేను ఇప్పుడే పెద్దగా మాట్లాడలేను. కానీ బాహుబ‌లి కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది.అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అద్భుతమైన అప్‌డేట్‌ను త్వరలో అందిస్తాను” అని రాజమౌళి తెలిపారు.

Advertisement
ss rajamouli responds on baahubali 3
ss rajamouli responds on baahubali 3

SS Rajamouli : అంద‌రు వెయిటింగ్ ఇక్క‌డ‌…!

కాగా, రాజ‌మౌళి ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల కోసం చూస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబుతో మూవీకి కమిట్ అయ్యారు. అది పూర్తయ్యాకే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తారు రాజమౌళి. ఇక రాజమౌళి ఒక్కో సినిమాకు ఎన్నేళ్లు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గతంలోనూ ఓసారి సోషల్ మీడియా చాటింగ్ లో రాజమౌళి బాహుబలి-3పై హింట్ ఇచ్చినా, సినిమా కచ్చితంగా తీస్తామని చెప్పడం మాత్రం ఇదే తొలిసారి. రాజమౌళి ప్రకటనతో సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘బాహుబలి-3’ కోసం వెయిటింగ్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Advertisement
Advertisement