Home » Entertainment » Ss Rajamouli Tweet About His Ishita Koduri
Entertainment

SS Rajamouli : రాజమౌళి మేన కోడలు ఎవ‌రో తెలుసా..? ఆమె కూడా గొప్ప స్టారే..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 5, 2021, 9:15 am
Advertisement

SS Rajamouli : తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఫ్లాప్ అనేది లేకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా ముందుకు సాగుతున్న డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని నటీ నటులందరూ ఆశపడుతుంటారు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఈ సంగతులు పక్కనబెడితే.. రాజమౌళికి అతిపెద్ద సపోర్ట్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచే లభిస్తుంది.రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్. కాగా, ఆయన మేన కోడలు ఇషితా కోడూరి స్పోర్ట్ పర్సన్. స్పోర్ట్స్ రంగంలో స్టార్‌గా ఎదుగుతున్న ఇషితా కోడూరి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.

Advertisement

ss rajamouli tweet about his ishita koduri

స్పోర్ట్స్ అనగానే అందులో మరీ ముఖ్యంగా క్రికెట్ అనగానే కేవలం ఆడవారికి మాత్రమే అని భావిస్తుంటారు చాలా మంది. ఆ నేపథ్యంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో సత్తా చాటగలరని మాటలతో కాకుండా చేతలతో నిరూపిస్తోంది ఇషిత కోడూరి. అబ్బాయిలతో సమానంగా మాత్రమే కాదు.. అవసరమైతే వారి కంటే పై స్థాయిలోనూ అమ్మాయిలు రాణించగలరని ఇషిత ప్రూవ్ చేస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఉమెన్ అండ‌ర్ -19 క్రికెట్ టోర్న‌మెంటులో ఇషిత కోడూరి పాల్గొని సత్తా చాటింది. ఆమె ఫాస్ట్ బౌల‌ర్‌గా ఆక‌ట్టుకోవ‌డంతో పాటు హైద‌రాబాద్ టీంను గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విష‌యాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి స్వయంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో అందరికీ తెలిసింది. ఈ విషయం తెలుసుకుని ఇషిత కోడూరిని నెటిజన్లు, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.

Advertisement

SS Rajamouli : రాజమౌళి మేనకోడలు ఆ రంగంలో స్టార్..

ss rajamouli tweet about his ishita koduri

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన 45 సెకన్ల గ్లింప్స్ విడుదల చేయగా, అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫిక్షనల్ స్టోరిగా వస్తున్న ఈ ఫిల్మ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి