karthika deepam 5 november 2021 full episode
Karthika Deepam 5 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1189 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత.. ప్రియమణిని పిలిచి ఎలాగైనా కార్తీక్ ఇంటికి వెళ్లాలని.. అక్కడే సెటిల్ అయిపోవాలని చెబుతుంది. ఇంతలో భారతి.. తన ఇంటికి వస్తుంది. ఏంటి విషయాలు అని అడుగుతుంది. సౌందర్య గారు మిమ్మల్ని దోషనివారణ పూజకు రమ్మని చెప్పారు అని అంటుంది. మోనిత మాత్రం అస్సలు పట్టించుకోదు. అస్సలు.. ఆమె చెప్పే విషయాలను వినదు. కార్తీక్ కు చాలా డేంజర్ అట అన్నా కూడా అస్సలే వినదు మోనిత. దీంతో భారతికి చాలా కోపం వస్తుంది. అయినా కూడా మోనిత వినదు. పోనీ నువ్వు వెళ్తావా భారతి అంటుంది. నిన్ను అడగడం ఏంటి.. నన్ను అడగొచ్చు కదా… అంటుంది మోనిత.
karthika deepam 5 november 2021 full episode
వాళ్లు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నీకు తెలుసు కదా. పీటల మీద పెళ్లి ఆపించారు. నన్ను ఎంత హింసించారో తెలుసు కదా. నేను ఆలోచిస్తానులే నువ్వు వెళ్లిపో లేట్ అవుతుంది అని చెప్పి భారతిని పంపించేస్తుంది మోనిత. కట్ చేస్తే.. సౌందర్య, కార్తీక్… ఇద్దరూ మాట్లాడుతుంటారు. నేను పూజకు వస్తాను కానీ.. మోనిత పక్కన మాత్రం అస్సలు కూర్చోను అంటాడు కార్తీక్. ఒకవేళ నేను మోనిత పక్కన కూర్చొని పూజ చేస్తే నేను మోనితను ఒప్పుకున్నట్టే కదా.. అంటాడు కార్తీక్.
పొద్దున ఏం జరిగిందో చూశావు కదా. కరెంట్ షాక్ కొట్టి ఉంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయం వేస్తోంది కార్తీక్. తల్లి బాధను అర్థం చేసుకోరా అంటుంది సౌందర్య. ఇంతలో కార్తీక్.. దేవుడి దగ్గరికి సౌందర్యను తీసుకెళ్లి దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను స్పృహలో ఉండగా ఏ తప్పు చేయలేదు అంటాడు. అరేయ్.. ఇప్పుడు తప్పు ఒప్పుల గురించి మాట్లాడే సమయం లేదురా. నువ్వు పూజ చేస్తేనే నాకు మనశ్శాంతి అని అంటుంది సౌందర్య. ఇంతలో దీప వచ్చి.. శాంతి ఏంటి అత్తయ్య. రాత్రి 11 గంటలకు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది దీప.
దీప రావడంతో సౌందర్య, కార్తీక్ షాక్ అవుతారు. కానీ… దీపకు అన్నీ అర్థం అవుతాయి కానీ.. ఏదీ తెలియనట్టుగా మాట్లాడుతుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఏం చేయాలో సౌందర్యకు అర్థం కాదు. ఇంతలో ప్రియమణి వెనుక గేట్ నుంచి ఇంటికి రావడం చూసిన దీప… ప్రియమణిని ఆపుతుంది. అర్ధరాత్రి వేళ ఎందుకు ఇలా దొంగతనంగా వస్తున్నావు అని అడుగుతుంది. దీంతో మోనితమ్మ దగ్గరికి వెళ్లాను దీపమ్మ అంటుంది. ఏంటి మోనితతో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా? అంటుంది. దీంతో అవును అంటుంది. అసలు మోనితమ్మ నన్ను వదిలిపెట్టదమ్మా అంటుంది. అంటే మోనిత చెబితేనే నువ్వు ఇక్కడికి వచ్చావా? పాపం అని జాలిపడి తీసుకొస్తే నువ్వు చేసే పని ఇదా? నడువు.. బయటికి నడువు. ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపో. ఇంకేం మాట్లాడకు. నాకు కోపం పెరగకముందే ఇక్కడ నుంచి వెళ్లిపో.. అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ప్రియమణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
karthika deepam 5 november 2021 full episode
మరోవైపు హిమ.. కార్తీక్ ను పిలిచి డాడీ ఈరోజు మనం ఇక్కడే పడుకుందాం. సరదాగా కబుర్లు చెప్పుకుందాం డాడీ. అందరం ఈరోజు ఇక్కడే ఉందాం అని అంటుంది. దీంతో సరేరా నువ్వు అడిగితే కాదంటానా చెప్పు అని అంటాడు కార్తీక్. అమ్మను కూడా రమ్మని చెబుదాం అంటుంది హిమ. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. దీప కూడా వస్తుందా అని అంటాడు. అవును.. ఈరోజు మనం నలుగురం కలిసి ఉందాం అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో చూడాల్సిందే.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.