TDP
TDP : 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. కానీ, 2019 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ, జనసేనలతో పొత్తులో లేకుండా ఒంటరిగానే బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అలా ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన టీడీపీ ప్రస్తుతం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది.టీడీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ వేసుకుని మరి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది.
TDP
అయితే, బీజేపీలోని ఓ వర్గం మాత్రం టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవడం లేదని,అందుకే ఇటీవల ఢిల్లీలో బీజేపీ ఏపీ వ్యవహారాలు చేసుకునే ఇన్‌చార్జి, సీనియర్ నేత సునీల్ దేవధర్ మీడియా సమావేశం పెట్టి మరి టీడీపీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో టీడీపీ బీజేపీ పొత్తు గురించి ఆసక్తి కర చర్చ జరుగుతున్నది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ టీడీపీ అప్పుడే పొత్తుల గురించి ఆలోచన చేస్తుందా? అని అనుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులో ఉండి కొన్ని స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు మళ్లీ ఆనాటి పొత్తు కాంబినేషన్ అనగా టీడీపీ-బీజేపీ-జనసేన తెరమీదకు వస్తుందేమోననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.
BJP
కాగా, బీజేపీని పొత్తుకు ఒప్పిస్తే జనసేన ఆటోమేటిక్‌గా పొత్తులో భాగస్వామి అవుతుందనే వాదన కూడా వినబడుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు చివరి నిమిషం వరకు పొత్తుకు ప్రయత్నిస్తారని పలువురు అనుకుంటున్నారు.అయితే, చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే, రాష్ట్రనాయకత్వం సలహా, సంప్రదింపులు లేకుండానే బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకు భవిష్యత్తులో సై ..అంటుందా చూడాలి మరి..
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.