SSMB29 Movie అప్డేట్ ఏంటి.. రాజమౌళి, మహేష్ బాబు ప్లాన్ ఏంటి..!
SSMB29 Movie : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందేష భారీ బడ్జెట్ తో యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేసి రాజమౌళికి ఇచ్చారంట. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో వరల్డ్ అడ్వాన్స్ ట్రావెలర్గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఇప్పటికే సినిమా బేసిక్ అవుట్ లైన్ అయితే రాజమౌళి మైండ్ లో ఉంది. స్క్రిప్ట్ సిద్ధం చేసే బాధ్యతను తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి జక్కన్న అప్పగించారట. తాజాగా రాజమౌళి సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారంట. అందులో భాగంగానే స్క్రిప్ట్ మొత్తం చదివి చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
స్క్రీన్ ప్లే విషయంలో రాజమౌళి అంత సంతృప్తికరంగా లేకపోవడంతో మొత్తం మరల రివేజ్ చేయమని రైటింగ్ టీం కి సూచించారట. దీంతో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ టీం స్క్రిప్ట్ పై మరోసారి పనిచేస్తారని తెలుస్తోంది. ఓవైపు జక్కన్న స్క్రిప్టుల మార్పులు చేస్తూనే మరోవైపు క్యాస్టింగ్ ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు టాక్. మహేష్ బాబుకి జోడిగా ఇండోనేషియా బ్యూటీని ఫైనల్ చేశారని ప్రచారం నడుస్తుంది. అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఆమె సినిమాలో చేయడం ఖాయమని టాక్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సక్సెస్ మూడ్ లో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చి సినిమా ముచ్చట్లు షేర్ చేసుకున్నారు.
సినిమాలో రెండు డాన్స్ బీట్స్ చేయటానికి కారణం మహేష్ బాబు తెలిపారు. గుంటూరు కారం తర్వాత మరల మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని అందుకే సినిమాలో సరదా తీర్చుకున్నట్లు మహేష్ బాబు తెలిపారు. కొద్దిరోజుల్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన తర్వాత రాజమౌళి సినిమా పై మహేష్ బాబు ఫోకస్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ కూడా నిర్వహించబోతున్నారు. మరి అఫీషియల్ గా ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.