Sita Ramulu : సీత రాములు నిద్రించిన ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..?ఆ ప్రదేశం ఇదే..!!
Sita Ramulu : మన భారతదేశం యొక్క గొప్ప ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. తింటే గారెలే తినాలి. వింటే రామాయణమే వినాలి. అన్నట్టుగా రామాయణం గురించి ఆయోగ పురుషుడు రాముడు గురించి ఎంత విన్న ఎన్నిసార్లు విన్న.. తనివి తీరదు.. ఇక రామాయణం గురించి అందులో చెప్పబడిన సంఘటన గురించి మన దేశంలో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలామంది రామాయణం అంటే రాముడి జననం, సీతారాముల కళ్యాణం, సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం, సీతాపుహరణం రావణ పద్ధతి అయోధ్య రాక రాముడి పట్టాభిషేకం వీటి గురించి ఆలోచిస్తారు. కానీ ఇక ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి ఎవరు ఎక్కువ ఆలోచించరు.. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సీతారాములు నిద్రించిన ప్రదేశాన్ని ఎవరు చూసి ఉండరు.. ఆ ప్రదేశం ఎక్కడుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో రామ సముద్రం గ్రామానికి ఓ పెద్ద చరిత్ర ఉన్నది ఆ రామసముద్రంలో ఉన్న భావి దగ్గర సీతారాములు నిద్రించారని అక్కడే స్నానాలు ఆచరించారని గ్రామంలో ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది. ఒకరోజు సీత రాములు వేటకు వెళ్లేటప్పుడు రామసముద్రం అనే ఊరి దగ్గరికి వచ్చేసరికి చీకటి అవడంతో ఆ గ్రామం నుండి వెళ్లాలనుకున్న రాత్రివేళ సమయంలో వెళ్లడం ఎందుకని రామసముద్రం గ్రామంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో సీతమ్మకు దాహం వేయడంతో రామున్ని సీతమ్మ నాకు దాహం వేస్తుంది అని చెప్పింది. అప్పుడు చుట్టుపక్కలంతా ఎక్కడ చూసినా నీరు లేకపోవడంతో రాముడు తన చేతిలో ఉన్న బాణంతో ఒక్కసారిగా భూమిలోకి బాణం వేశాడు.అప్పుడు అక్కడ నీరు ప్రవహించింది.. అని రామసముద్రం పెద్దలు చెప్తున్నారు. రామసముద్రం ప్రాంతానికి చెందిన రైతు చెంచయ్య కొన్ని విషయాలను తెలియజేశారు. అక్కడి ప్రజలందరూ నమ్మకంగా సీతారాములు అక్కడే నిద్రించారు.
అదేవిధంగా ఆ బావిలో ఉన్న నీరుతో స్నానాలు ఆచరించడం వలన రోగాలు పోతాయని నమ్ముతూ ఉంటారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికైనా సరే పాము కరిచిన తేలు కరిచిన ఇప్పటికి మరణించిన వారు లేరని అంత చరిత్ర గల ఊరు అని ఓ పెద్దాయన తెలియజేశారు.. సీతారాములు అక్కడే నిద్రించారని ఇక అప్పటి నుంచి ఆ గ్రామానికి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వచ్చి నిద్ర చేసేవారట. అక్కడే స్నానాలను ఆచరించి వెళ్లేవారట.. పిల్లలు లేనివారు అక్కడ స్నానాలు ఆచరించినట్లయితే పిల్లలు పుట్టే వారిని చెంచయ్య తెలియజేయడం జరిగింది.. అయితే ఆ బావి దగ్గర మైనార్టీకి చెందిన ముస్తఫా అనే ఒక వ్యక్తి ఆ భావి దగ్గరే ఉండేవాడట.. అక్కడికి వచ్చిన వారందరికీ తాయితలు వేస్తూ.. మంత్రాలు జపిస్తూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరినీ బాగు చేస్తూ ఉండేవారట.. పూర్వకాలంలో ఒకతను మరణిస్తే వారిని మళ్లీ తిరిగి ప్రాణం పోసినట్టు రామసముద్రంలో గ్రామ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు..
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.