Samantha : సమంతకు ప్రపోజ్ చేసిన స్టార్ హీరో .. మరి సామ్ రియాక్షన్ ఏంటి ?
Samantha : తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది సమంత. ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా రెండో షెడ్యూల్లో పాల్గొననుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏ మాయ […]
Samantha : తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది సమంత. ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా రెండో షెడ్యూల్లో పాల్గొననుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
ఏ మాయ చేసావే సినిమా తో నాగచైతన్య ప్రేమలో పడ్డ సమంత పెద్దలను ఒప్పించి గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని విభేదాల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి ఏదో ఒక వార్త వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి సమంత రెండో పెళ్లి చేసుకోబోతుదని వార్తలు వస్తున్నాయి. సమంతను ఓ యంగ్ హీరో దగ్గరుండి చూసుకుంటున్నాడని, మొదటినుంచి సమంతా అంటే ఆ హీరోకి క్రష్ అని, ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది. కానీ సమంత అతనిపై
నాకు ఎలాంటి ఫీలింగ్ లేదంటూ చెప్పుకొస్తుంది. అంతేకాకుండా సమంతను సోషల్ మీడియాకి దూరంగా ఉండేలా నిర్ణయం తీసుకునేలా చేశాడని, సమంత పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడం తో ఆమెకు ధైర్యం చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే సమంత మాత్రం అతనితో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. కానీ ఆ వ్యక్తి మాత్రం సమంతను పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది నిజమో కాదో తేలీదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.