Meena : షూటింగ్ లో అందరి ముందే మీనా చెంప పగలగొట్టిన స్టార్ హీరో .. అంత పెద్ద తప్పు ఏం చేసింది ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Meena : షూటింగ్ లో అందరి ముందే మీనా చెంప పగలగొట్టిన స్టార్ హీరో .. అంత పెద్ద తప్పు ఏం చేసింది ..??

Meena : హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న మీనా ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ మరణించడం వలన వార్తల్లో నిలిచింది. చిన్న వయసులో భర్త […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 June 2023,6:00 pm

Meena : హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న మీనా ఇటీవల ఆమె భర్త విద్యాసాగర్ మరణించడం వలన వార్తల్లో నిలిచింది. చిన్న వయసులో భర్త కోల్పోవడంతో మీనా రెండో పెళ్లి చేసుకుంటుంది అని వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాదని తేలింది.

ఇకపోతే మీనా తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. అందులో ఒకటి ‘ సీతారామయ్యగారి మనవరాలు ‘. సంస్కృతి, సాంప్రదాయాన్ని చూపించే ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమాకి మూడు ఫిలింఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఆయన మనుమరాలిగా మీనా నటించింది. అయితే మొదటగా ఈ సినిమాని కృష్ణ గారితో చేయాలని అనుకున్నారు కానీ కృష్ణ గారు స్క్రీన్ పై తనని తాను చూసుకొని బాగోలేనని ఏఎన్నార్ ని చేయమని సలహా ఇచ్చారట.

Star hero slap cheek to Meena in shooting

Star hero slap cheek to Meena in shooting

ఇక ముందుగా ఈ సినిమాలో ఏఎన్ఆర్ మనవరాలు శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారు కానీ ఆమె నో చెప్పడంతో మీనాకి అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించేటప్పటికి మీనాకి పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో తెలియదట. షూటింగ్లో ఏఎన్ఆర్ ముందు కాలి మీద కాలు వేసుకొని కూర్చొని ఆయన వచ్చిన లేవలేదట. దాంతో ప్రవర్తనను గమనించిన ఎఏన్నార్ ఆమెను మందలిచ్చారు. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఇలా పెద్దవారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటే ఇండస్ట్రీలో ఎదగలేవు. ముందుగా పెద్దవారిని ఎలా గౌరవించాలో తెలుసుకో అని గట్టిగా మందలిచ్చారట. అయితే ఈ విషయాన్ని అప్పట్లో ఏఎన్ఆర్ మీనా చంప పగలగొట్టారంటూ రూమర్ క్రియేట్ చేసి వైరల్ చేశారు. కానీ అసలు జరిగింది మాత్రం ఇది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది