Meena : సీనియర్ హీరోయిన్స్ అంతా ఒకే చోట.. అందరితో మీనా తెగ రచ్చ చేసిందిగా..!
ప్రధానాంశాలు:
Meena : సీనియర్ హీరోయిన్స్ అంతా ఒకే చోట.. అందరితో మీనా తెగ రచ్చ చేసిందిగా..!
Meena : ఈ మధ్య హీరోలు, హీరోయిన్స్ అంతా కలిసి పార్టీలు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగానో, టీవీ షోలలోనే కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు నటీమణులు ఓ మాస్ రీల్ చేయడంతో వైరల్ గా మారింది. సీనియర్ హీరోయిన్స్ మీనా Meena, సంగీత, మహేశ్వరి ముగ్గురు కలిసి ఓ మ్యూజిక్ కి సరదాగా రీల్ చేసారు.

Meena : సీనియర్ హీరోయిన్స్ అంతా ఒకే చోట.. అందరితో మీనా తెగ రచ్చ చేసిందిగా..!
Meena దుమ్ము రేపేశారుగా..
ముగ్గురు ఇష్టమొచ్చినట్టు డ్యాన్స్ చేసి ఈ రీల్ షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం మీనా, రోజా, నగ్మా, రంభ, సంగీత, మహేశ్వరి MAheswari.. పలువురు స్టార్ హీరోయిన్స్ అంతా కలిసి చెన్నైలో ప్రభుదేవా ఈవెంట్లో కనువిందు చేసారు. అప్పుడు వీరంతా కలిసి దిగిన ఫోటోలు కూడా షేర్ చేసారు.
ఇలా సీనియర్ హీరోయిన్స్ అంతా కలిసి తెగ రచ్చ చేస్తుండడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రీల్ లోకనిపించిన మీనా meena ఇప్పటికి సినిమాలు, టీవీ షోలతో బిజీగానే ఉంది. సంగీత కూడా సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంది. మహేశ్వరి మాత్రం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వకపోయినా తమిళ టీవీ షోలలో అలరిస్తుంది.