Akhanda 2 : అఖంఢ‌2 కోసం బోయ‌పాటి పెద్ద స్కెచ్చే వేశాడు.. ఏకంగా స్టార్ హీరోని విల‌న్‌గా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Akhanda 2 : అఖంఢ‌2 కోసం బోయ‌పాటి పెద్ద స్కెచ్చే వేశాడు.. ఏకంగా స్టార్ హీరోని విల‌న్‌గా..!

Akhanda 2 : వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మతం అవుతున్న బాల‌య్య‌కి మంచి హిట్ ఇచ్చాడు బాల‌య్య‌. ఈ ఇద్దరి కాంబినేష‌న్ అంటే అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. బాలయ్య,బోయపాటి ఈ కాంబినేషన్ అంటే ట్రేడ్ లో, అభిమానుల్లో ఓ రేంజి క్యూరియాసిటీ.‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టడమే అందుకు కారణం. దాంతో మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించే వీరి కలయికలో మరో చిత్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 September 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Akhanda 2 : అఖంఢ‌2 కోసం బోయ‌పాటి పెద్ద స్కెచ్చే వేశాడు.. ఏకంగా స్టార్ హీరోని విల‌న్‌గా..!

Akhanda 2 : వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మతం అవుతున్న బాల‌య్య‌కి మంచి హిట్ ఇచ్చాడు బాల‌య్య‌. ఈ ఇద్దరి కాంబినేష‌న్ అంటే అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. బాలయ్య,బోయపాటి ఈ కాంబినేషన్ అంటే ట్రేడ్ లో, అభిమానుల్లో ఓ రేంజి క్యూరియాసిటీ.‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టడమే అందుకు కారణం. దాంతో మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించే వీరి కలయికలో మరో చిత్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ‘అఖండ’కు సీక్వెల్‌ ఎప్పుడు మొదలవుతుంది. దాని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది.

Akhanda 2 పెద్ద ప్లానే..

అంతేకాదు, చాలా వరకూ టాకీ పార్టును సైతం కంప్లీట్ చేసుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చే ఈ చిత్రాన్ని నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇది ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ తన 110వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీన్ని ‘అఖండ’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బాలయ్య తన 109వ సినిమాను పూర్తి చేసిని వెంటనే బోయపాటి ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారట.

Akhanda 2 అఖంఢ‌2 కోసం బోయ‌పాటి పెద్ద స్కెచ్చే వేశాడు ఏకంగా స్టార్ హీరోని విల‌న్‌గా

Akhanda 2 : అఖంఢ‌2 కోసం బోయ‌పాటి పెద్ద స్కెచ్చే వేశాడు.. ఏకంగా స్టార్ హీరోని విల‌న్‌గా..!

అఖండ 2′ ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉందని ఇందులోనూ తొలి భాగంలాగే పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. అయితే ఎన్నికలు తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తానంటూ తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు అయ్యిపోయాయి. త్వరలోనే ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో బాలయ్య, బోయపాటి సినిమా గురించిన అప్డేట్స్ మొదలుకానున్నాయి. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీయటానికి నిర్మాతలు ఫిక్స్ అయ్యిపోయారు.ఈ చిత్రంలో బాలయ్యను ఢీకొట్టే విలన్‌గా మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్నాడట. ఇప్పటికే అతడికి బోయపాటి స్టోరీని కూడా వినిపించాడని, దీనికి వెంటనే ఓకే చెప్పేశాడని టాక్ వినిపిస్తోంది. మ‌రో వైపు యంగ్ హీరో కార్తికేయ‌ని విల‌న్‌గా సెట్ చేశాడ‌నే టాక్ నడుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది