Akhanda 2 : అఖండ‌ 2 క్రేజీ బ‌జ్.. బాల‌య్య‌కి ధీటుగా గ‌ట్టోడినే దించుతున్న బోయ‌పాటి శీను..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akhanda 2 : అఖండ‌ 2 క్రేజీ బ‌జ్.. బాల‌య్య‌కి ధీటుగా గ‌ట్టోడినే దించుతున్న బోయ‌పాటి శీను..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 February 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Akhanda 2 : అఖండ‌ 2 క్రేజీ బ‌జ్.. బాల‌య్య‌కి ధీటుగా గ‌ట్టోడినే దించుతున్న బోయ‌పాటి శీను..!

Akhanda 2 : డాకు మ‌హ‌రాజ్ daku maharaj చిత్రంతో చివ‌రిగా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన బాల‌య్య Balakrishna ఇప్పుడు అఖండ‌2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బాలకృష్ణ Balakrishna లీడ్​ రోల్​లో డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ‘అఖండ 2: తాండవం కి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. ఈ మూవీలో విలన్​కు కూడా హీరో రేంజ్​లో పవర్​ఫుల్​​ సీన్స్ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా అఖండ సీక్వెల్​లో Akhanda 2 విలన్ పాత్ర పోషించనున్న నటుడి పేరు బయటకు వచ్చింది. ​ అత‌ను మ‌రెవ‌రో కాదు ఆది పినిశెట్టి. ప్రస్తుతం హైదరాబాద్‌లో Hyderabad నిర్మించిన భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. బాలకృష్ణ- ఆది పినిశెట్టి పాల్గొంటున్నారు.

Akhanda 2 అఖండ‌ 2 క్రేజీ బ‌జ్ బాల‌య్య‌కి ధీటుగా గ‌ట్టోడినే దించుతున్న బోయ‌పాటి శీను

Akhanda 2 : అఖండ‌ 2 క్రేజీ బ‌జ్.. బాల‌య్య‌కి ధీటుగా గ‌ట్టోడినే దించుతున్న బోయ‌పాటి శీను..!

Akhanda 2 స‌రైనోడే..

ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వంలో యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆది సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. బాలకృష్ణ, Balakrishna ఆది మధ్య పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చిత్రబృందం తెలిపింది. ‘అఖండ’కు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయిక. ఎస్‌. థమన్‌ సంగీతం S Thaman అందిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే బోయపాటి శ్రీను Boyapati Srinuతో ఆది పినిశెట్టి  aadhi pinisetty కి మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఒక సినిమా చేశారు. ‘సరైనోడు’ సినిమాలో ఆది పినిశెట్టి చేత ఎక్స్ట్రార్డినరీ విలనిజం చేయించారు బోయపాటి.

ఇప్పుడు మరోసారి అతడిని తన సినిమాలోకి తీసుకున్నారు. ఈ సారి ఎటువంటి విలనిజం చూపిస్తారో ? తను ప్రతి సినిమాలో విలన్ క్యారెక్టర్స్ డిజైన్ చేయడం మీద బోయపాటి ప్రత్యేకంగా వర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఆయన సినిమాల్లో రెగ్యులర్ కైండ్ ఆఫ్ విలన్స్ ఉండరు. మరి ఈసారి ఆది పినిశెట్టి కి ఎటువంటి క్యారెక్టర్ వచ్చిందో? లుక్ అయితే చాలా కొత్తగా ఉండబోతుందో చూడాలి. ‘అఖండ’ సినిమాలో Balakrishna బాలకృష్ణకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ Pragya Jaiswal కనిపించారు. ఆ తరువాత ఇటీవల వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమాలోనూ సందడి చేశారు. ‘అఖండ 2’లో ఆవిడ క్యారెక్టర్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ రోల్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. మిగతా ఆర్టిస్టుల వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది